కోలీవుడ్  స్టార్ హీరో అజిత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం "తునివు". హెచ్ వినోద్ డైరెక్షన్లో దొంగతనం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.ఇక ఈ రోజుల్లో సినీతారలందరూ కూడా సోషల్ మీడియాను విపరీతంగా ఫాలో అవుతుంటే, అజిత్ మాత్రం సోషల్ మీడియాకు చాలా అంటే చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పటికీ అజిత్ కానీ ఇంకా అలాగే ఆయన భార్య షాలిని కానీ ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లో అస్సలు లేరు.అయితే తాజాగా షాలిని అజిత్ కుమార్ పేరిట ఇన్స్టాగ్రామ్ లో ఒక కొత్త అకౌంట్ కనిపిస్తుంది. ఒక వారం క్రితమే ఈ అకౌంట్ అనేది ఓపెన్ చెయ్యబడింది. ఇందులో కేవలం ఒకేఒక్క పోస్ట్ ఉంది. షాలిని ఇంకా అలాగే అజిత్ కలిసిదిగిన అన్ సీన్ పిక్ అది. దీంతో ఇక షాలిని సోషల్ మీడియా డిబట్ చేసిందని తెలుస్తుంది.


ఈ సంగతి పక్కనపెడితే అజిత్ నటిస్తున్న ఈ తునివు చిత్రానికి తమిళనాట ఊహించని రేంజిలో భారీ క్రేజ్  ఉంది. దానికి కారణం అజిత్. ఎందుకంటే అజిత్  తమిళనాడులో ఎక్కువ అభిమానులు వున్న హీరో. మిగతా రాష్ట్రాల్లో ఏమో కానీ... తమిళనాడులో మాత్రం అజిత్  క్రేజ్ ని మ్యాచ్ చేసే హీరో లేరు. పైగా అజిత్ పక్కా మాస్ హీరో. అందువల్ల ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయంటే ఖచ్చితంగా అభిమానులతో పాటు యావత్  కోలీవుడ్  సినీ లోకం సహా ఎంతగానో ఎదురు చూస్తుంది. అయితే గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సినిమాకి ప్రమోషన్లు చెయ్యాలని టీం ఫిక్స్ అయ్యింది.ఖచ్చితంగా ఈ సినిమా నుంచి రాబోయే ప్రతి అప్డేట్  కూడా ఒక రేంజిలో ఉండేలా ప్లాన్  చేశారు. మరి చూడాలి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: