కోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ గురించీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కేవలం కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా తన సినిమాలను విడుదల చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకున్న నడిగర్ సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతున్న విశాల్ ఇప్పుడు లత్తి (లాఠీ) అనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది . ఈ సినిమా నుంచి త్వరలోనే ట్రైలర్ లాంచ్ చేస్తామని చిత్ర బృందం అధికారిక తేదీని కూడా ప్రకటించడం జరిగింది.


తమిళంలో లత్తి పేరిట విడుదలవుతున్న ఈ సినిమాను తెలుగులో లాఠీ పేరిట విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్ను విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ మూవీ టీజర్ లో విశాల్ క్రౌర్యం హీట్ పెంచాయి. ఒక పోలీస్ ఆఫీసర్గా అతడి నిజాయితీ,  తెగువ ప్రతిదీ ఆవిష్కరిస్తూ ఇప్పుడు టీజర్ దూసుకొచ్చింది. ఆఫ్ట్రాల్ కానిస్టేబుల్ గాడు అంటూ విలన్ ఎంత ఆక్రోశిస్తుంటే అంతగా విశాల్ యాక్షన్ తో సమాధానం ఇస్తున్నాడు.  ఈ మూవీలో భారీ యాక్షన్ సీన్స్ కి కొదవి ఏమి ఉండదని టీజర్ చూస్తే అర్థమవుతుంది.


ఇకపోతే ఒక భారీ భవంతిలో క్రౌడ్స్ నడుమ కాప్ యాక్షన్ సీన్ ని మరో లెవెల్ లో క్రియేట్ చేశారు. ఈ సీన్ సినిమాకి హైలైట్ గా ఉండనుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5:00 గంటలకు సినిమా ట్రైలర్ను లంచ్ చేస్తామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. టీజర్ తోనే అందరూ అలరించిన విశాల్.. ఇప్పుడు ట్రైలర్ తో ఎలా తన యాక్షన్ సన్నివేశాలతో భయపెడతాడో చూడాలి.  ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణా - నంద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇకపోతే వీ ఎఫ్ ఎక్స్ కారణంగా ఈ సినిమాను సెప్టెంబర్ 15న తెలుగు , తమిళ్,  హిందీ,  కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: