
చెన్నైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించగా అందులో క్లైమాక్స్ విషయాలు మాట్లాడుతూ.. ఈ సినిమాలో తాను ఒంటికన్నుతో నటించడం చాలా సవాలుగా ఉంది అని ఆ సన్నివేశం కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది అంటూ క్లైమాక్స్‌లో జరగబోయే విషయాన్ని వెల్లడించారు దీన్ని బట్టి చూస్తే .. ఒంటి కన్నుతో విశాల్ ఏ విధంగా ప్రత్యర్థులను ఎదుర్కొన్నాడు అనేది చాలా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మరి ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్ అన్నీ కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు ఈ సినిమా మరో పందెంకోడి అవుతుంది అంటూ పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాకు కేవలం చెన్నైలోనే కాకుండా ఇటీవల తిరుపతిలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచు మోహన్ బాబు హాజరయ్యారు. విశాల్ గురించి చెబుతూనే రాజకీయాలను గురించి ప్రస్తావిస్తూ ఎన్నో విషయాలను వెల్లడించారు మోహన్ బాబు. తిరుపతిలోని ఎస్ డి హెచ్ ఆర్ జూనియర్ కాలేజీలో గ్రాండ్ గా జరిగిన ఈవెంట్ లో మోహన్ బాబు మాట్లాడుతూ .. విశాల్ నాన్నగారు నాతో ఎం ధర్మరాజు ఎంఏ లాంటి అద్భుతమైన సినిమా తీశారు. ఆయన నా చిత్ర నిర్మాత ..ఈ సందర్భంగా విశాల్ తల్లిదండ్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను. విశాల్ పందెంకోడి సినిమా చూసా.. ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మన్స్. ఈ చిత్రం కూడా ఈయనకు మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందిస్తుంది అంటూ తెలిపారు.