నందమూరి ఫ్యామిలీ లో చాలా మంది అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి విజయం సాధించారు. నందమూరి బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ విజయవంతంగా వారి కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

బాలయ్య చిన్న కూతురు అయిన తేజస్విని అన్ స్టాపబుల్ షోకు క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఈ షో విజయం సాధించే విషయంలో తన వంతు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బాలయ్య చిన్న కూతురు మరియు అల్లుడు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.

బాలయ్య బోయపాటి శ్రీను కాంబో బ్లాక్ బస్టర్ హిట్ కాంబో కాగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మరో సినిమా 14 రీల్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తుంది.. బాలయ్య చిన్నల్లుడు భరత్ ఈ సినిమాలో 20 శాతం పెట్టుబడి పెట్టి లాభాల్లో వాటా తీసుకోనున్నారని వార్త వినిపిస్తుంది.. మరోవైపు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ త్వరలో సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.. ఆదిత్య 369 సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం.

ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుందని ఇప్పటికే వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు బాలయ్య చిన్న కూతురు నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తుంది. నందమూరి కుటుంబంలో ఇప్పటికే 11 బ్యానర్లు ఉండగా రాబోయే రోజుల్లో ఈ బ్యానర్ల సంఖ్య మరింత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. హీరో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్నాయని తెలుస్తుంది.

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనుందని ఖర్చు విషయంలో మాత్రం రాజీ పడకూడదనే ఆలోచనతోనే బాలయ్య సొంత బ్యానర్ లో సినిమాలు తెరకెక్కనున్నాయని సమాచారం కూడా అందుతోంది. బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా సొంత బ్యానర్ లోనే తెరకెక్కే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: