తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మహానటి సినిమా ద్వారా మంచి పాపులారి సంపాదించుకుంది హీరోయిన్ కీర్తి సురేష్.ఈ సినిమాతో జాతీయస్థాయిలో అవార్డును కూడా అందుకుంది. దీంతో తెలుగు ఆడియన్స్ ఈమెను హోంన్లీ బ్యూటీగా పిలుస్తూ ఉంటారు. ఇక తమిళం లో కూడా వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. చివరిగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రంలో ఈమె నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తన తదుపరి చిత్రాలతో కూడా బిజీగా ఉండబోతోంది.
కీర్తి సురేష్ ఖాళీ సమయం దొరికితే చాలు ఎక్కువగా టూర్లు, వేకేశష్స్ కు వెళుతూ ఉంటుంది. ఇక ఆ ఫోటోలను సైతం అభిమానులతో పంచుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలో భాగంగా తన ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది ఆ వెంటనే బ్యాంకాంగ్లో థాయిలాండ్ కు వెళ్లి అక్కడ క్రిస్మస్ హాలిడేనా ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది.తాజాగ కీర్తి సురేష్ పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సముద్రపు దగ్గర రిలాక్స్ అవుతూ సముద్రపు అందాల నడుమ చూస్తూ బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒక చేతిలో జ్యూస్ తాగుతూ ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇంస్టాగ్రామ్ లో 237 మిలియన్ల వ్యూస్ని సంపాదించింది కళావతి సాంగ్స్. ఇక ఈ చిత్రంలోని పాటలు అద్భుతంగా డాన్స్ చేశారు మహేష్ బాబు కీర్తి సురేష్. ప్రస్తుతం కీర్తి సురేష్ నటిస్తున్న చిత్రాలలో నానితో కలిసి దసరా, భోళా శంకర్ సినిమాతోపాటు తమిళంలో సరైన్, మామ్నాన్ వంటి చిత్రాలలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: