ఇక ప్రతి ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోకి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలనేది అతడి క్రేజ్ ఇంకా అలాగే సినిమా మార్కెట్ మీద, అలాగే వసూళ్ల మీద ఆధారపడి ఉంటుంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ ఉన్న హీరో సినిమా ఏవరేజ్ గా ఉన్నా కూడా ఖచ్చితంగా అది బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతుంది. ఇక దాన్ని బట్టి హీరో ఇమేజ్ ఏంటో  ఊహించుకోవచ్చు.ఆ క్రేజ్ ని బట్టే రెమ్యునరేషన్ కూడా ఇస్తారు. ఇప్పుడున్న హీరోలు వంద కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని అందుకుంటున్నారు. తమిళ హీరో విజయ్ అయితే 'వారిసు' సినిమాకి ఏకంగా వంద కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు అప్పట్లో అనేక వార్తలొచ్చాయి.ఆ సినిమా ఒప్పుకునే సమయానికి విజయ్ రెమ్యునరేషన్ ఏకంగా వంద కోట్లకు చేరిపోయింది. పైగా ఈ సినిమా విడుదలకు ముందే దిల్ రాజు భారీ ఎత్తున లాభాలను ఆర్జించారని సమాచారం తెలిసింది. ఇక ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా.. థియేటర్ లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా వంద కోట్ల పైగా వసూళ్లను సాధించింది.


ఇలాంటి నేపథ్యంలో విజయ్ ఇప్పుడు తన రెమ్యునరేషన్ ని ఏకంగా రూ.150 కోట్లకి పెంచేశారని సమాచారం తెలుస్తుంది.విజయ్ తన తరువాత సినిమాని లోకేష్ కనగరాజ్ తో చేయనున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా రూ.150 కోట్లు డిమాండ్ చేశాడని టాక్. అయితే సినిమా నాన్ థియేట్రికల్, థియేట్రికల్ రైట్స్ తో చాలా సులభంగా లాభాలు వచ్చేస్తాయనే నమ్మకం నిర్మాతలకు ఉంది. అందుకే హీరో అడిగినంత డబ్బుని వారు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. పైగా ఈ సినిమాలో సంజయ్ దత్ రౌడీగా కనిపిస్తున్నాడని తెలిసింది. కథ ప్రకారం.. విజయ్ ఈ సినిమాలో ఓ మిడిల్ ఏజ్ డాన్ పాత్ర పోషిస్తున్నాడని సమాచారం తెలుస్తుంది.ఈ సినిమాలో విజయ్ కి జోడిగా త్రిష నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకులు మిస్కిన్ ఇంకా గౌతమ్ మీనన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఇంకా LCU యూనివర్స్‌లో భాగం అయిన సూర్య, కార్తీ, కమల్ హాసన్‌లు కూడా విజయ్ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: