లోక నాయకుడు కమలహాసన్ కూతురుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది శృతిహాసన్. శృతిహాసన్ మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో సింగర్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా కంపోజర్ రైటర్ యాక్టర్ గా టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ వరకు రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది శృతిహాసన్. తాజాగా సంక్రాంతి కానుకగా తన ఖాతాలో రెండు బ్లాక్ బస్టర్ హిట్టలను వేసుకుంది. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి మరియు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలలో ఇద్దరు సీనియర్ హీరోల సరసన హీరోయిన్గా నటించి మంచి విజయాన్ని అందుకుంది.

అలా ఒకేసారి రెండు సినిమాలతో విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం ఫుల్ సంతోషంగా ఉంది ఈమె.అయితే తాజాగా ఈ సినిమాల గురించి మాట్లాడింది శృతిహాసన్ ఇందులో భాగంగానే ఈ సినిమాల గురించి శృతిహాసన్ మాట్లాడుతూ... ఒక నటికీ తాను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలవ్వడం రెండూ కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. బాలీవుడ్ లో ఆమె నటించిన తొలి సినిమా లక్ విడుదలై 14 ఏళ్ళు అయిన సందర్భంగా ఈ విషయాలను వెల్లడించింది శృతిహాసన్. అంతేకాదు ఇందులో భాగంగానే శృతిహాసన్ మాట్లాడుతూ.. నేను సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటిలో నా సింగింగ్ గురించి ఎక్కడ మాట్లాడొద్దని నాకు చెప్పారు..

ఒకవేళ నువ్వు అలా చెప్తే నీకు సినిమాలపై ప్రభావం పడుతుందని అన్నారు.. కానీ నేను మాత్రం అలా చేయకుండా రెండిటికీ ప్రాధాన్యతనిస్తూ వచ్చాను.. మొదటిసారి నేను మైకు పట్టుకుని పాట పాడినప్పుడు మా నాన్న చాలా భయపడ్డారు..అనంతరం కోవిడ్ సమయంలో నేను నా ప్రతిభను అందరికీ చూపించాను..అనంతరం స్టేజ్ షో లలో పాల్గొని ప్రేక్షకుల స్పందనను నా కళ్ళారా చూస్తూ ఆనందించాను.. పాటలు రాయగల శక్తి నాకు దేవుడు ఇవ్వడం ఒక పెద్ద బహుమతి ఆ బహుమతిని ప్రపంచంతో పంచుకోవడం ఇంకా గొప్ప విషయం అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్..  శ్రుతిహాసన్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్లో సైతం వరుస స్టార్ హీరోలో సరసన సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సరసన సలార్ సినిమాలో కూడా నటిస్తోంది శృతిహాసన్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: