సాధారణంగా స్టార్ హీరోలకు సంబంధించిన సినీ అప్డేట్ల గురించి కోట్ల మంది అభిమానులు వేయికళ్లతో ఎదురు చూడటం  జరుగుతూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు అప్డేట్ లేట్ అయిన సమయంలో.. ఇక నిరాశ చెందుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో మాత్రం అభిమానులు కాస్త మితిమీరిపోతున్నారు అని చెప్పాలి. తమ అభిమాన హీరో సినిమాకు సంబంధించిన అప్డేట్ రాలేదంటే చాలు సోషల్ మీడియానే తమ అస్త్రంగా  మార్చుకొని ఇక సినిమా నిర్మాతలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.


 ఇక ఎంతకీ నిర్మాతలు స్పందించకపోతే సోషల్ మీడియా వేదిక ట్రోల్స్ చేయడం కూడా మొదలుపెడుతున్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల విషయంలో కూడా ఇలాంటిదే చేసారు అభిమానులు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్30 సినిమా విషయంలోను ఇదే జరుగుతుంది. త్రిబుల్ ఆర్ సినిమాకు ముందు ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ జరిగింది. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ టీజర్ లాంచ్ చేశారు. కానీ అప్పటినుంచి ఇప్పటివరకు ఒక అప్డేట్ కూడా లేదు. అసలు సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా అన్నదానిపై కూడా క్లారిటీ లేకుండా పోయింది.


 దీంతో ఇక ఫ్యాన్స్ అందరు కూడా నిర్మాతలు దర్శకుడి పట్ల విమర్శలు చేస్తూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ఇటీవల అన్న కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన ఎన్టీఆర్.. ఈ వేదికపై తన అభిమానులకు క్లాస్ పీకాడు. ఒక్కోసారి సినిమాలు చేస్తున్నప్పుడు చెప్పడానికి ఏముండదు. ప్రతిరోజు ప్రతి గంట ఒక అప్డేట్ ఇవ్వాలంటే.. ఎంతో కష్టమైన విషయం. మా సినిమాల విషయంలో మీ ఆరాటం,  ఉత్సాహం మాకు తెలుసు. కానీ ఇదే ఉత్సాహం నిర్మాతలు దర్శకుల పట్ల ఒత్తిడి తీసుకువస్తుంది.. అభిమానులు కోరుకుంటున్నారని లేని అప్డేట్ ఇవ్వలేము. ఏది పడితే అది ఇస్తే మీకే నచ్చదు.


ఈ అప్డేట్ విషయంలో నాతోపాటు అందరూ కూడా ప్రెషర్ లో మునిగిపోతున్నారు.  ఏదైనా అప్డేట్ ఉంటే మా భార్యల కంటే ముందు మీకే చెబుతాం. ఎందుకంటే మీరే మాకు ముఖ్యం.. నిర్మాతల పై ఒత్తిడి తీసుకురావద్దు.. ఎందుకంటే సినిమా తీయాలంటే ఎంతో కష్టపడాలి ఫోకస్ పెట్టాలి. ఇలాంటప్పుడు అప్డేట్ కోసం ఒత్తిడి పెంచితే సినిమా సరిగ్గా రాదు అంటూ ఎన్టీఆర్ క్లాస్ పీకాడు. అదే సమయంలో ఫిబ్రవరిలో తన సినిమా లాంచ్ చేసి మార్చి 20 లోపు షూటింగ్ మొదలు పెడతామని పండగ లాంటి న్యూస్ అభిమానులకు చెప్పాడు. అంతేకాదు వచ్చే ఏడాది ఏప్రిల్ 5లోపు సినిమా రిలీజ్ చేస్తామంటూ కూడా చెప్పేశాడు తారక్.

మరింత సమాచారం తెలుసుకోండి: