మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి త్రిష గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తెలుగు , తమిళ ఇండస్ట్రీ లలో ఎన్నో మూవీ లలో నటించి ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం త్రిష తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కంటే కూడా తమిళ సినిమా ఇండస్ట్రీ మూవీ లలో నటించడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తోంది. 

అందులో భాగంగా ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ వరుస తమిళ మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తుంది. అందులో భాగంగా కొంత కాలం క్రితమే త్రిష , మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ అనే భారీ బడ్జెట్ పన్ ఇండియా మూవీ లో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం త్రిష , తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో మూవీ లో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. 

ఇలా తమిళ సినిమా ఇండస్ట్రీ లో వరస మూవీ ల అవకాశాలను దక్కించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా త్రిష తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో త్రిష అదిరిపోయే ట్రెడిషనల్ లుక్ లో ఉన్న గోల్డ్ కలర్ సారీ ని కట్టుకొని అందుకు తగిన గోల్డ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి చాలా ట్రెడిషనల్ అండ్ క్లాస్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం త్రిష కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట అదిరిపోయే రేంజ్ లో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: