చిత్ర పరిశ్రమలో బాలయ్యకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. నందమూరి హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు బాలయ్యా...రీసెంట్ గానే వీరసింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు..

అంతకుముందు అఖండతో సినిమా కరోనాతో అల్లాడిపోతున్న సినిమా ఇండస్ట్రీకి ఓ దారి చూపించారు బాలయ్య.. ప్రస్తుతం ఎన్.బి.కె 108 సినిమా చేస్తున్నాడు . నందమూరి తారకరత్న మరణించిన కారణంగా సినిమా షెడ్యూల్ ని పోస్ట్ పన్ చేసిన బాలయ్య త్వరలోనే కొత్త షెడ్యూల్ ని కూడా ఫిక్స్ చేయబోతున్నాడట.

  బాలయ్య ఓ కమర్షియల్ యాడ్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'వేగ శ్రీ' అనే జ్యువెలరీ యాడ్ ని బాలయ్య ఓకే చేశారు .ఈ యాడ్ కోసం అఖండ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్‌ తో ఆయన జోడి కట్టాడు. ఇదివరకే అఖండ సినిమాతో హిట్ పెయిర్ గా టాక్ సంపాదించుకున్న ఈ జంట..మరోసారి జతకట్టడంతో..ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అఖండ సినిమా టైంలోను .. సినిమా ప్రమోషన్స్ లోనూ.. సక్సెస్ మీట్లలోను ప్రగ్యా-బాలయ్యతో ఆడి పాడింది.. అంతేనా బాలయ్య మరో సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంటుంది అంటూ వార్తలు కూడా వినిపించాయి.

ఇలాంటి క్రమంలోనే బాలయ్య తో కమర్షియల్ యాడ్ లో ప్రగ్యా ఛాన్స్ కొట్టేసింది. ఆమెకు పదే పదే బాలయ్య ఛాన్స్ ఇవ్వడం ఇండస్ట్రిలో హాట్ టాపిక్ గా మారింది.. అయితే బాలయ్య కూడా ప్రగ్యాకి మరీ ఎక్కువ అవకాశం ఇస్తున్నారని ఈ యాడ్ లో శృతిహాసన్ ఇంకా బాగుండేది అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు కొందరు కుర్రాళ్ళు రెచ్చిపోయి బాలయ్య ఫేవరెట్ హీరోయిన్ హనీ రోజ్ ని యాడ్ కి పెట్టుంటే చాలా బాగుండేది  అంటూ చెప్పుకొస్తున్నారు . అయితే ఇండస్ట్రీలో ఎంతో మంది ట్రెడిషనల్ హీరోయిన్స్ ఉన్న కేవలం ప్రగ్యాకే బాలయ్య్ ఛాన్స్ లు ఇవ్వడానికి కారణం ఏంటా..? అంటూ కామెంట్ చేస్తున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: