కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తాజాగా షాకింగ్ కాంబినేషన్ సెట్ అయినట్టు తెలుస్తోంది. కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార, రాఘవ లారెన్స్ తో ఫస్ట్ టైం ఓ హారర్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకి రత్నకుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. రత్నకుమార్ ఇప్పటివరకు మూడు సినిమాల డైరెక్టు చేశారు. వాటిల్లో బెంజ్ టాకీస్, మీయద మాన్ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ ఈ సినిమాలు తెలుగులో మాత్రం డబ్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన గులుగులు ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. అయితే దర్శకుడిగా కాకుండా రచయితగా మాత్రం ఈయనకు సపరేట్ ట్రాక్ రికార్డు ఉంది. గత ఏడాది కమల్ హాసన్ నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్

 విక్రమ్ సినిమాకి ఈయనే రచయిత. అలాగే విజయ్ నటించిన మాస్టర్ సినిమాకు ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న లియో మూవీకి కూడా ఈయనే రచయితగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలకు ఆయన కోరైటర్ అయినప్పటికీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో ఇతనికి మంచి బాండింగ్ ఉంది. అయితే ఇటీవల హీరోయిన్ నయనతార కు ఓ లైన్ వినిపించడంతో అది ఆమెకు బాగా నచ్చడంతో ఎక్కువగా ఆలోచించకుండా రాఘవ లారెన్స్ తో నటించడానికి ఈమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. హారర్ బ్యాక్ డ్రాప్ మూవీస్ మన నయనతారకు కొత్తేమి కాదు. గతంలో ఆమె డోరా,ఐరా, కనెక్ట్ లాంటి హారర్ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో నటించిందిమ్ ఇక రాఘవ లారెన్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది.

హారర్ సినిమాలు అంటే ఆయనకు కొట్టిన పిండే. దయ్యాలంటే పూనకంతో ఊగిపోతాడు. అయితే తన పక్కన నటించే హీరో ఇమేజ్, అందం గురించి కూడా పట్టించుకోకుండా నయనతార ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది నిజంగా విశేషం అని చెప్పాలి. ఇటీవల డైరెక్టర్ విగ్నేశ్ శివన్ తో పెళ్లి ఆ తర్వాత పిల్లలు ఇలా కాస్త గ్యాప్ తీసుకున్నా నయనతార ఆ మధ్య చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో చెల్లెలి పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈమె షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటిస్తోంది. ఇక రాఘవ లారెన్స్ రుద్రుడు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాతో పాటు ఇటీవల చంద్రముఖి 2 షూటింగ్ కూడా ప్రారంభించాడు. మొత్తం మీద మొట్టమొదటిసారి రాఘవ లారెన్స్ తో నయనతార జోడి కడుతునడంతో వీళ్ళ పెయిర్ బిగ్ స్క్రీన్ పై ఎలా ఉండబోతుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: