ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఒకే విషయం గురించి తెగ చర్చించుకుంటున్నారు. అదే దగ్గుబాటి వారసులు అయిన వెంకటేష్, రానా తండ్రీకొడుకులుగా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ గురించి. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ సెన్సేషన్ సృష్టిస్తుంది. ఇక రేటింగ్స్ పరంగా ప్రస్తుతం సరికొత్త చరిత్ర సృష్టించి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. అంతా బాగానే ఉంది కానీ.. ఈ సినిమాలో వెంకటేష్ పాత్రను చూసిన తర్వాత అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఎందుకంటే వెంకటేష్ అంటే ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ ఉంది. బూతు సినిమాల జోలికి పోకుండా.. మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాలు లేకుండా ఇక ఫ్యామిలీతో కలిసి  వెంకటేష్ సినిమా చూడొచ్చు అని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు.


 వెంకీ మామ సినిమాలో ఉండే ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఫిదా అయిపోతూ ఉంటారు. కానీ రానా నాయుడు వెబ్ సిరీస్ చూసిన తర్వాత నిజంగా ఇందులో కనిపించేది వెంకటేషేనా  అని నమ్మలేకపోతున్నారు ప్రేక్షకులు. ఎందుకంటే రానా నాయుడు వెబ్ సిరీస్లో వెంకటేష్ పాత్ర అంత బోల్డ్ గా ఉంది. మితిమీరిన సెక్స్ సీన్స్ లో కూడా నటించాడు వెంకటేష్. అంతేకాదు వెంకటేష్ నోటి నుంచి బూతు డైలాగులు రావడం తో అందరూ షాక్ అయ్యారు అని చెప్పాలి. అయితే ఇక వెంకటేష్ రానానాయుడు వెబ్ సిరీస్ చేయడం వెనుక ఒక పెద్ద ప్లానే ఉంది అన్నది మాత్రం తెలుస్తుంది. ఫ్యామిలీ హీరో ఇమేజ్ నుంచి బయట పడేందుకే వెంకటేష్.. ఈ వెబ్ సిరీస్ ను చేశాడట. ఎందుకంటే ప్రస్తుతం వెంకి సైంధవ్ అనే సినిమా చేస్తున్నాడు. హిట్ సినిమా సిరీస్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకుడు. అయితే ఈ సినిమాలో వెంకి పాత్ర కాస్త బోల్డ్ గా ఉంటుందట. ఇక ఈ సినిమా కోసం రిహార్సల్స్ అవుతుందనే వెంకటేష్ రానా నాయుడు ను ఒప్పుకున్నాడట వెంకటేష్. సైంధవ సినిమాలో వెంకటేష్ మాట్లాడే బూతు డైలాగులు ఇక రానా నాయుడు చూసిన తర్వాత ప్రేక్షకులకు అలవాటైపోతాయని ప్లాన్ చేశాడట  వెంకీ ప్లాన్ ప్రకారమే ఇప్పుడు సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: