బాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ , మాలీవుడ్ ఇలా ఇండియాలో అనేక రకాల సినీ ఇండస్ట్రీలు ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు లభించింది. ఇక్కడ సినిమాలు అన్న హీరో హీరోయిన్స్ అన్న ఇండియాలో ప్రత్యేకమైన క్రేజీ ఉందని చెప్పవచ్చు. ఏ సినిమా అయినా సరే భాషతో సంబంధం లేకుండా సినిమాలను వీక్షిస్తూ ఉంటారు. ప్రేక్షకులు అయితే ఇండియాలో విడుదలైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లు రాబడ్డాయి ఇప్పటివరకు టాప్ లో నిలిచిన సినిమాలను ఒకసారి తెలుసుకుందాం.


బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1958 కోట్ల రూపాయలతో ముందు వరుసలో ఉన్నది. ఇక ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా మొదటి భాగం కంటే రెండో భాగానికి విపరీతమైన క్రేజ్ రాబట్టింది. దీంతో ఈ సినిమా రూ.1810 కోట్లను రాబట్టింది. ఇక తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన rrr చిత్రం అనేక అవార్డులను అందుకోవడమే కాకుండా నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1236 కోట్లు రాబట్టింది.

అయితే గతంలో చూస్తే బాహుబలి మొదటి భాగం కంటే రెండో భాగానికి మూడు రెట్లు అధిక లాభం రాగా కేజిఎఫ్ మొదటి భాగం కంటే రెండో భాగానికి ఆరు రెట్లు ఎక్కువగా వసూళ్లను రాబట్టింది.ఇక పొన్నియన్ సెల్వన్  మొదటి భాగం 500 కోట్ల సాధించగా..పొన్నియన్ సెల్వన్ -2 సినిమా కూడా 1000 కోట్లు తాకగలదా అంటూ అభిమానులు సినీ ప్రేక్షకులు అంచనాలు వేస్తున్నారు మరి కొంతమంది మొదటి భాగం చాలా లెంతీగా ఉండటం వల్ల పెద్దగా ఇతర భాషలలో ఆకట్టుకోలేకపోయింది. కేవలం తమిళనాడులోని రూ .200 కోట్ల రూపాయలను రాబట్టింది.. ఒకవేళ ఈ సినిమా సీక్వెల్ ఇతర భాషలలో కూడా మెప్పిస్తే రూ.1000 కోట్లు దాచడం పెద్ద సంగతి కాదంటూ తెలియజేస్తున్నారు. మరి ఏ మేరకు అంచనాలను ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: