నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి కొత్త దర్శకుడు అయినటువంటి శ్రీకాంత్ ఓదెల ఆదర్శకత్వం వహించగా కీర్తి సురేష్మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇది వరకే నాని మరియు కీర్తి సురేష్ కాంబినేషన్ లో నేను లోకల్ అనే మూవీ రూపొందింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ ఇద్దరి జంటకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి.

దసరా మూవీ వీరిద్దరి కాంబినేషన్.లో రెండవ సినిమా. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు తో పాటు కన్నడం , మలయాళం , హిందీ , తమిళ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ అదిరిపోయే రేంజ్ లో ఈ సినిమా ప్రమోషన్ లను నిర్వహిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా ముఖ్యంగా ఈ మూవీ లో హీరో గా నటించినటువంటి నాని దేశ వ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్ లను నిర్వహిస్తున్నాడు.

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ కి సంబంధించిన 5 భాషలకు సంబంధించిన ట్రైలర్ లను లక్నో నుండి ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... దసరా మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చిత్ర బృందం రెండు తేదీలను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 24 వ తేదీన గానీ ... 26 వ తేదీన గాని నిర్వహించే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: