నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ఈ సంవత్సరం వీర సింహా రెడ్డి అనే మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... హనీ రోజ్ ఈ మూవీ లో కీలక పాత్రలో నటించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ... దునియా విజయ్ విలన్ పాత్రలలో నటించారు.

 తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ ... అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీnలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతుంది  ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ విషయాన్ని తాజాగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ లో కూడా కాజల్ అగర్వాల్ తాజాగా జాయిన్ అయింది.

ఈ విషయాన్ని కూడా ఈ మూవీ బృందం ప్రకటించింది. ఈ మూవీ లో శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. అలాగే ఈ సినిమా షూటింగ్ లో కూడా శ్రీ లీల జాయిన్ అయినట్లు కూడా చిత్ర బంధం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. రేపు అనగా మార్చి 22 వ తేదీన ఉగాది సందర్భంగా ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేయనునట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం రేపు ఎలాంటి అప్డేట్ ను విడుదల చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: