అనసూయ జబర్దస్త్ కార్యక్రమంలో కనిపించక పోవడంతో ఎక్కువగా వార్తల్లో అయితే ఉండటం లేదు. హీరోయిన్ గా ఆమె రానించాలి అనుకుంటుంది

కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని  కూడా సద్వినియోగం చేసుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఈమె నటించిన రంగమార్తాండ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ అమ్మడి యొక్క పాత్ర ఉంటుందట . రంగ మార్తాండ సినిమాలో పాత్రలు  చాలా విభిన్నంగా ఉంటాయనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అనసూయ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

అనసూయ రంగమార్తాండ సినిమాలో చిన్న పాత్రలో కనిపించబోతుందని సమాచారం.. ఆ చిన్న పాత్రలో కూడా అద్భుతమైన నటనను కనబర్చినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా రంగమార్తాండ సినిమా ఉంటుందని యూనిట్ సభ్యులు కూడా చాలా నమ్మకంగా చెబుతున్నారు.ప్రస్తుతం రంగ మార్తాండ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాలో నటించిన అనసూయ ఇటీవల ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకు వచ్చిన అవకాశం గొప్ప విషయం ఇది అంటూ సంతోషం వ్యక్తం చేసింది. అదే సమయంలో ఇలాంటి ఒక పాత్రకు తనను ఎంపిక చేసుకున్నందుకు గాను కృతజ్ఞతలు అన్నట్లుగా ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. హీరోయిన్ గా కాకపోయిన ఇలాంటి ఒక పాత్ర చేయడం వల్ల చాలా మంచి అనుభూతి కలుగుతుందని ఈ సందర్భంగా ఆమె మీడియా ముందు చెప్పుకొచ్చిందటా.. ఇక అనసూయ విషయానికి వస్తే రెండు మూడు సినిమాలలో హీరోయిన్ గా కూడా ఈమె నటిస్తుందట. అయితే ఆ సినిమా లు ఎంత వరకు విడుదల అవుతాయి అనేది క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరో వైపు ఈమె బుల్లి తెరకు పూర్తి గా బై చెప్పేసినట్లేని అని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: