మెగా స్టార్ చిరంజీవి మంచి నటుడు మాత్రమే కాదు. జీవితంలో కూడ చాల తెలివిగా వ్యవహరిస్తూ వీలైనంత వరకు వివాదాలలోకి వెళ్ళకుండా తన గౌరవాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. అంతేకాదు అతడి దగ్గరకి ఏదర్శకుడు వెళ్ళినా వారి స్థాయితో సంబంధం లేకుండ వారు చెప్పే కథలను వింటూ తనకు బాగా నచ్చిన కథలో మాత్రమే నటిస్తాడు.


‘భీష్మ’ సూపర్ సక్సస్ తరువాత దర్శకుడు వెంకీ కుడుమల ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అతడు చెప్పే కథలను హీరోలు విన్నారు కానీ ఏ హీరో వెంకీ కుడుమల తో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. ఇలాంటి పరిస్థితులలో చిరంజీవి వెంకీ కుడుమల తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటన వచ్చింది. ఆ మూవీకి ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తాడని కూడ వార్తలు వచ్చాయి.


అయితే వెంకీ కుడుమల ఫైనల్ గా తయారుచేసిన కథ చిరంజీవికి నచ్చక పోవడంతో ఆ మూవీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది అంటూ వార్తలు వచ్చాయి. దీనితో ‘భీష్మ’ లాంటి సక్సస్ సాధించిన దర్శకుడుకి ఇలాంటి కష్టాలు ఏమిటి అంటూ కొందరు కామెంట్స్ కూడ చేసారు. అయితే అనుకోకుండా మళ్ళీ నితిన్ రష్మిక వెంకీ కుడుమల కాంబినేషన్ మూవీ మళ్ళీ సెట్ అయింది. ప్రస్తుతం నితిన్ కి ఒక మంచి హిట్ కావాలి.


ఆ హిట్ వెంకీ కుడుమల ఇవ్వగలదు అన్న ధైర్యంతో ఈ మూవీ ప్రాజెక్ట్ కు ఓకె చేసినట్లు వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా ప్రారంభం అయిన ఈ మూవీ ప్రారంభోత్సవానికి చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చి వెంకీ కుడుమల ను ఆశీర్వదించడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. మరికొందరైతే ప్రస్తుతానికి చిరంజీవి వెంకీ కుడుమల మూవీ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి లేకపోయినప్పటికీ భవిష్యత్ లో వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ ఉంటుంది అన్న సంకేతాలు చిరంజీవి వ్యూహాత్మకంగా ఇచ్చినట్లు అవుతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..
మరింత సమాచారం తెలుసుకోండి: