ఇందులో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ కి విలన్ గా నటిస్తున్నారని వార్త గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నది. ఈ వార్త నిజం చేస్తూ మేకర్ ఎన్టీఆర్ సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నుంచి జాయిన్డ్ ది షూట్ ఆఫ్ ది హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ అంటూ ఒక ట్విట్ ని షేర్ చేయడం జరిగింది..పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని విడుదల చేయడం జరుగుతోంది .ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నది. డైరెక్టర్ కొరటాల శివ సైఫ్ అలీఖాన్ని విలన్ గా చూపించడంతో ఈ సినిమాకు మంచి మార్కెట్ పెంచి విషయం అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ప్రభాస్ తో కలిసి ఆదిపురష్ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నారు.. ఈ నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్తో ఎన్టీఆర్ పోటీపడితే ఆన్ స్క్రీన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.. మరి రాబోయే రోజుల్లో సైఫ్ అలీ ఖాన్ ఎన్ని సినిమాలలో నటిస్తారో చూడాలి. అయితే గతంలో మాత్రం జాన్వీ కపూర్ ఎన్టీఆర్ను రిజెక్ట్ చేసిందని సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ ని రిజెక్ట్ చేశారని వార్తలు వినిపించాయి కానీ ఇవన్నీ కేవలం రూమర్స్ అన్నట్లుగా తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి