ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే .ఇక  తారక్ మరియు కళ్యాణ్రామ్ ఇద్దరు కూడా ఆ ఈవెంట్ కి రాలేదు. దీంతో వీరిద్దరూ రాకపోవడంతో కొంతమంది వారిద్దరినీ విమర్శిస్తున్నారు. మే 20 నా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. అయినా కూడా తారక్ శతజయంతి వేడుకలకు రావాలి అనుకుంటే కచ్చితంగా వచ్చి ఉండేవాడు. ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈవెంట్ కి రాకపోవడానికి అసలు కారణం వేరే ఉందని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ కల్యాణ్రామ్ ఇద్దరికీ ఈవెంట్ కి సంబంధించిన ఆహ్వానం అందింది. అయినప్పటికీ నందమూరి కుటుంబానికి సంబంధించిన ఒక కీలక వ్యక్తికి వీరిద్దరూ రావడం ఇష్టం లేదట. అనంతరం ఈ విషయం కళ్యాణ్ రామ్ మరియు ఎన్టీఆర్ లకి తెలిసిందట.

దీంతో ఆ ఈవెంట్ కి వెళ్లి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ఈ నిర్ణయాన్ని తీసుకుని శతజయంతి వేడుకలకు వెళ్లలేదు అని తెలుస్తుంది .ఎప్పటినుండో ఎన్టీఆర్ ఏ తప్పు చేయకపోయినప్పటికీ కొంతమంది మాత్రం ఆయన్ని ఎప్పుడూ దెబ్బ పొడుస్తూ ఉంటారు. ఇప్పటికి జూనియర్ ఎన్టీఆర్ ని విమర్శించే వారి సంఖ్య చాలానే ఉంటుంది. ఆయనకు ఎదురవుతున్న ఇబ్బందులను కూడా గమనిస్తే బాగుంటుంది అని ఆయన అభిమానులు ఎప్పటినుండో కోరుకుంటున్నారు. అవేమీ పట్టించుకోని జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం సినిమాల పైన పెట్టారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి.

అయినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు ఆ వార్తలపై నోరు విప్పలేదు. అనవసర విషయాలలో వివాదాలలో అసలు జోక్యం చేసుకోడు ఎన్టీఆర్. ఆయనకి అసలు ఇలాంటి విషయాలు కొంచెం కూడా ఇష్టం ఉండదు. అతని వల్ల ఎవరు బాధపడకూడదు అని ఎప్పుడూ అనుకుంటాడు తారక్. అంతేకాదు ఎప్పుడు ఇతరులు మంచి కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి రిలీజ్ కి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ గా మారాయి.  ఈ సినిమా కలెక్షన్లను తక్కువగా చూపించి నెగటివ్ ప్రచారాన్ని చేస్తున్నారు కొంతమంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: