దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి యావత్ ప్రపంచానికి తెలుసలే చేశాడు దర్శకుడు రాజమౌళి. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకి ఎంత క్రేజ్ వచ్చిందో మనందరికీ తెలిసిందే. సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు అందరూ ఈ పాటకు కాలు కలిపారు. అంతేకాదు అంతర్జాతీయ వేదికపై కూడా ఈ సినిమాని ప్రస్తావించారు. అంతేకాదు జేమ్స్ కెమెరూన్ వంటి దిగ్గజ దర్శకులు సైతం దర్శకుడు రాజమౌళి పనితనాన్ని క్రియేటివిటీని చూసి షాక్ అయ్యారు. 

సినిమా టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు అందరూ ప్రస్తావించి దర్శక ధీరుడు రాజమౌళిని పొగడ్తలతో ముంచారు.. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాకుండా ప్రతిష్టాత్మకమైన అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో హీరోలుగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ గురించి ఇప్పటికే చాలామంది హాలీవుడ్ నిపుణులు సైతం మాట్లాడారు. ముఖ్యంగా ఈ సినిమాలో కొమరం భీమ్ నటించిన జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.  ఇక తాజాగా ఈ సినిమా గురించి స్పైడర్ మాన్ హీరో టామ్ హలండ్  మాట్లాడాడు. అయితే ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా త్రిబుల్ ఆర్ సినిమాని ప్రశంసించాడు.

  ముఖ్యంగా రామ్ చరణ్ పై తనకున్న ప్రేమను తెలియజేశాడు. ఈయన అయితే ఇటీవల ముంబైలో జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ స్టార్లు కూడా వెళ్లారు. జెండాయ, గిగి హాడిడ్ లతో పాటు టామ్ హాలండ్ కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళాడు. మూడు రోజులపాటు భారత్ లోనే ఉన్నాడు.  ఇందులో భాగంగానే ఆయన భారత్ పర్యటన గురించి చెప్పుకొచ్చాడు. అనంతరం త్రిబుల్ ఆర్ సినిమా గురించి కూడా ప్రస్తావించడు.  మూడు రోజుల్లో ఎంతోమంది ప్రముఖులను కలిశానని ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా అద్భుతంగా జరిగింది అని..మధ్యలోనే నేను త్రిబుల్ ఆర్ సినిమాను కూడా చూశాను అని ..ఆ సినిమా నాకు చాలా బాగా నచ్చింది అని ..సినిమా అత్యద్భుతంగా ఉంది అని.. ముఖ్యంగా సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ అత్యద్భుతంగా ఉంది అని చెప్పుకొచ్చాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: