తెలుగు చిత్ర పరిశ్రమంలో క్యూట్ కపుల్స్ గా పేరు సంపాదించుకున్న వారిలో కాజల్ దంపతులు కూడా ఉన్నారు అని చెప్పాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు దశాబ్ద కాలానికి పైగానే స్టార్ హీరోయిన్గా హవా నడిపించిన కాజల్ అగర్వాల్.. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ప్రస్తుతం ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చారు అన్న విషయం తెలిసిందే. కాగా కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్న వ్యక్తి ప్రముఖ వ్యాపారవేత ఇక పలు బిజినెస్ లు సొంతంగా నడిపిస్తున్నాడు. అయితే కాజల్ అగర్వాల్ ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీగా ఉంది.



 ఇకపోతే ఇప్పుడు కాజల్ భర్త గౌతమ్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. అదేంటంటే గౌతమ్ కాజల్ కంటే ముందు ఒక స్టార్ హీరోయిన్ ప్రేమించాడట. ఆమెతో కొంతకాలం పాటు డేటింగ్ లో మునిగితేలాడట. కానీ ఆ తర్వాత మాత్రం ఆ హీరోయిన్ గౌతమ్ ని మొత్తం మోసం చేసిందట. ఇక ఈ విషయం కాజల్ అగర్వాల్ కూడా తెలుసట. ఎందుకంటే వీరిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ కావడంతో గౌతమ్ అన్ని విషయాలను కాజల్ అగర్వాల్తో పంచుకున్నాడట. ఇలా ఒక హీరోయిన్ ఏకంగా గౌతమ్ ఇచ్చిన డబ్బులను వాడుకొని చివరికి అతనికి హ్యాండ్ ఇచ్చిందట.


 అంతేకాదు ఆమెకు మరొకరితో కూడా పెళ్లి జరిగిపోయిందట. ఇక ఆ సమయంలోనే గౌతం డిప్రెషన్లో మునిగిపోయి.. ఇక వ్యాపారాలను కూడా చూసుకోలేకపోయాడట. ఇక అదే సమయంలో చిన్నప్పటి నుంచి మంచి స్నేహితురాలుగా ఉన్న కాజల్ అగర్వాల్ అతనిపై ప్రేమ చూపించిందట. ఇలా కాజల్ అగర్వాల్, గౌతమ్ మధ్య ప్రేమ పుట్టిందట. ఆ తర్వాత కొన్నాళ్లకే ఇక పెద్దలను ఒప్పించి వారి సమక్షంలోనే ఈ జంట పెళ్లి చేసుకుంది అన్న విషయం తెలుస్తుంది. ఇక ఇప్పుడు గౌతమ్ బ్రేకప్ ని మరిచిపోయి కాజల్తో సంతోషకరమైన లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: