సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా రూపొందిన డిజె టిల్లు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించి భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఈ మూవీ తో సిద్దు కి అదిరిపోయే రేంజ్ గుర్తింపు లభించింది. అలా డిజే టిల్లు మూవీ తో ఈ హీరోకు అద్భుతమైన గుర్తింపు లభించడంతో ఈ నటుడు ప్రస్తుతం ఈ మూవీ కి సీక్వల్ గా రూపొందుతున్న టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో సిద్దు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి "టికెట్ ఏ కొనకుండా" అంటూ సాగే మొదటి పాటను విడుదల చేసింది. ఈ సాంగ్ లో సిద్దు డైలాగ్ డెలివరీ ... బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకోగా ... ఈ సాంగ్ లో అనుపమ తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది.

అలా ఈ మూవీ లోని మొదటి సాంగ్ లో వీరిద్దరూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్  లభిస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ లోని మొదటి సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 3.47 మిలియన్ వ్యూస్ ... 203.2k
 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ మొదటి సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: