చిరంజీవి ఆఖరిగా నటించిన ఆరు మూవీ లు మొదటి రోజు ప్రీమియర్ షోస్ తో యూఎస్ఏ లో సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

చిరంజీవి తాజాగా భోళా శంకర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా యూఎస్ఏ లో ప్రీమియర్స్ తో 314 కే గ్రాస్ కలెక్షన్ లను అందుకుంది. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా ... అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించాడు.

చిరంజీవి హీరోగా రూపొందిన వాల్టేర్ వీరయ్య సినిమా మొదటి రోజు యూఎస్ఏ ప్రీమియర్ షోస్ తో 679 కే కలెక్షన్లను సాధించింది. ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహించాడు.

చిరంజీవి హీరోగా రూపొందిన గాడ్ ఫాదర్ మూవీ యూఎస్ఏ ప్రీమియర్ షోస్ తో 318 కే కలెక్షన్ లను అందుకుంది. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సత్య దేవ్ ... నయన తార కీలక పాత్రలో నటించారు.

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య మూవీ కి ప్రీమియర్స్ తో యూఎస్ఏ లో 650 కే కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ లో రామ్ చరణ్ కీలక పాత్రలో నటించాడు.

చిరంజీవి హీరోగా రూపొందిన సైరా నరసింహా రెడ్డి మూవీ యూఎస్ఏ ప్రీమియర్ షో స్ తో 857 కే కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ లో తమన్నా ... నయన తార హీరోయిన్ లుగా నటించగా ... సురేందర్ రెడ్డిమూవీ కి దర్శకత్వం వహించాడు.

చిరంజీవి హీరోగా రూపొందిన ఖైదీ నెంబర్ 150 మూవీ కి యుఎస్ఏ ప్రీమియర్ షోస్ తో 1.29 మిలియన్ కలెక్షన్ లు దక్కాయి. వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: