అయితే టాలీవుడ్ రౌడీ హీరోగా కొనసాగుతున్న విజయ్ దేవరకొండ ఒకవేళ మల్టీస్టారర్ చేస్తే ఆ సినిమాలో మరో హీరో ఎవరు అయితే బాగుంటుంది అని ఇప్పటికే అభిమానులు ఎన్నోసార్లు ఆలోచించారు. అయితే ఇప్పుడు అభిమానులు ఆలోచించడం కాదు ఏకంగా హీరో విజయ్ దేవరకొండ తన మనసులో ఉన్న మాటను చెప్పేసాడు. తాను ఒకవేళ మల్టీస్టారర్ లో నటించాల్సి వస్తే కోలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో నటించాలని అనుకుంటున్నాను అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.
దుల్కర్ సల్మాన్ నటించిన ఎన్నో సినిమాలను తాను టోరెంట్స్ లో చూసేవాడిని అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ఇక తాను ఎంతగానో అభిమానించే నటులలో దుల్కర్ సల్మాన్ కూడా ఒకరరూ అని తెలిపాడు. ఇక మల్టీస్టారర్ లో నటించాల్సి వస్తే తప్పకుండా దుల్కర్ సల్మాన్తో నటిస్తాను అంటూ మనసులో మాట బయటపెట్టాడు. కొత్త సినిమాల ప్రమోషన్ల నేపథ్యంలో ఒక చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించగా.. ఈ కార్యక్రమంలో దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ మాట్లాడారు. అయితే విజయ్ దేవరకొండతో కలిసి నటించడం తనకు కూడా ఇష్టమే అంటూ దుల్కర్ స్పందించాడు. కాగా దుల్కర్ సల్మాన్ నటించిన మహానటిలో విజయ్ దేవరకొండ కూడా కీలకపాత్రలో కనిపించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి