సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ప్రతివారం ఎన్నో సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఇలా విడుదలైన సినిమాలలో కొన్ని సినిమాలు మంచి విజయాలు సాధిస్తే కొన్ని మాత్రం ప్రేక్షకాదరణకు నోచుకోవు. అయితే ఇలా కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులకు నచ్చినప్పటికీ ఎందుకో ఎక్కడో తేడా కొట్టి చివరికి ప్లాప్ గానే మిగిలిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇలాంటి సినిమాలలో అటు మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఇప్పుడు టీవీలో వచ్చిన ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు.


 కానీ ఈ సినిమా అటు బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఫ్లాప్ గానే మిగిలిపోయింది. అచ్చం ఇలాగే పవన్ కళ్యాణ్ నటించిన జానీ సినిమా కూడా పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించడమే కాదు ఇక స్వీయ దర్శకత్వంలో చేసిన సినిమా జానీ. భారీ అంచనాలతో బాక్సాఫీస్ వద్ద విడుదలైంది. ఈ సినిమా ఇక ప్రేక్షకులకు కూడా నచ్చింది. కానీ ఎందుకో పెద్దగా హిట్ కాలేకపోయింది. చివరికి ఫ్లాప్ గానే మిగిలిపోయింది.



 అయితే ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఊసరవెల్లి సినిమా కూడా బాగుంటుంది. అయినా కూడా ఈ సినిమా పెద్దగా హిట్ ని అందుకోలేకపోయింది అని చెప్పాలి. ఇక ప్రభాస్ హీరోగా వచ్చిన మున్నా సినిమా కూడా ఇప్పుడు టీవీ లో వచ్చిన కూడా అందరూ ఆసక్తిగా చూస్తారు.  కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ సాధించలేదు. ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయి అటు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎందుకో అనుకున్న రీతిలో సక్సెస్ కాలేకపోయిన సినిమాలు చాలానే ఉన్నాయ్. అయితే సినిమాతో హిట్టు కొట్టాలి అనే భావనతోనే ప్రతి ఒక్కరు సినిమాలు తీస్తారు. కానీ ఆ సినిమా హిట్టు అవుతుందో ఫ్లాప్ అవుతుందా అని నిర్ణయించేది మాత్రం ప్రేక్షకులు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: