ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప ది రైస్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి భారీ సక్సెస్ ను అందుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు పుష్ప ది రూల్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాలో రష్మిక మందన , అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా ... పహాధ్ ఫాజల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇకపోతే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ వచ్చే సంవత్సరం ఆగస్టు నెల తర్వాత ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం త్రివిక్రమ్ , మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న గుంటూరు కారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తర్వాత త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్ తో తెరకెక్కించబోయే సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: