టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మ్యాచో హీరోగా హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే గత కొంతకాలంగా గోపీచంద్ సినీ కెరియర్ డైలమాలో పడింది అని చెప్పాలి. దానికి ముఖ్య కారణం గత కొంతకాలంగా ఈ హీరో వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. 'లౌక్యం' తర్వాత మళ్లీ గోపీచంద్ కి ఆ రేంజ్ హిట్టు పడలేదు. మధ్యలో 'జిల్', 'గౌతమ్ నంద', 'పక్కా కమర్షియల్' సీటీమార్' సినిమాలకు మంచి టాక్ వచ్చినా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయాయి. ఇక రీసెంట్ గా వచ్చిన 'రామబాణం' అయితే గోపీచంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. రొటీన్ కమర్షియల్ ఫార్మేట్ ఉన్న కథలకే గోపీచంద్ ప్రాధాన్యత ఇవ్వడం అతని కెరియర్ కు

 మైనస్ గా మారింది. ప్రస్తుతం ఓ కన్నడ దర్శకుడితో 'భీమా'(Bheema) అనే యాక్షన్ ఎంటర్టైనర్ ని చేస్తున్న గోపీచంద్ ఇప్పుడు మరో ప్లాప్ డైరెక్టర్ తో సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తోంది. సాధారణంగా సక్సెస్ ఉన్న డైరెక్టర్స్ తోటే సినిమాలు చేసేందుకు హీరోలు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ గోపీచంద్ మాత్రం రివర్స్ లో వెళ్తున్నారు. రీసెంట్ గానే శ్రీను వైట్లతో సినిమా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. వరుస డిజాస్టర్స్ తో శ్రీను వైట్ల కెరియర్ కు గ్యాప్ వచ్చింది. అయినా సరే ఆయనతో సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు మరో డిజాస్టర్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు రాధాకృష్ణ కుమార్. 

పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ఈ దర్శకుడు తెరకెక్కించిన 'రాదే శ్యామ్' గత ఏడాది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ మూవీ భారీ అంచనాలతో విడుదలై డిజాస్టర్ అందుకుంది. అంతేకాదు సుమారు రూ.100 కోట్లకు పైనే నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. దాంతో రాధాకృష్ణ ఇప్పటివరకు ఏ హీరో తో నెక్స్ట్ మూవీ ని కన్ఫర్మ్ చేయలేదు. తాజా సమాచారం ప్రకారం గోపీచంద్ తో ఈయన నెక్స్ట్ మూవీ ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఈ డైరెక్టర్ కి మొదటినుంచి ప్రభాస్ సపోర్ట్ ఉండటంతో UV క్రియేషన్స్ బ్యానర్లో గోపీచంద్ హీరోగా సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: