కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా వరుస పోస్టర్లతో దుమ్ము రేపుతోంది. రిలీజ్ కు ముందు ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ ఇలా పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు.తాజాగా బుధవారం (సెప్టెంబర్ 20) లియో మేకర్స్ మరో కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో విజయ్ చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు."కామ్ గా ఉండండి.. యుద్ధానికి సిద్ధం కండి" అనే క్యాప్షన్ తో ఉన్న ఈ పోస్టర్ లియో మూవీపై ఆసక్తిని మరింత పెంచేసింది. ఇందులో విజయ్ తన ఆయుధాన్ని సానబెడుతుంటే నిప్పు రవ్వలు ఎగిసిపడుతున్నాయి..విజయ్ దళపతి కొత్త అవతార్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.. విజయ్ లుక్ మరియు పోస్టర్ పై ఉన్న క్యాప్షన్ ఆధారంగా మూవీ స్టోరీపై ఫ్యాన్స్ భారీగా ఉహించుకుంటున్నారు.అంతేకాదు ఈ సినిమా ఆడియో లాంచ్ త్వరలోనే చెన్నైలో జరగబోతున్నట్లు వార్తలు  కూడా వస్తున్నాయి. 

పాన్ ఇండియా స్థాయిలో లియో సినిమా విడుదల అవుతుండటంతో త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రమోషన్లను కూడా మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌టైన్మెంట్స్ గ్రాండ్ గా విడుదల చేస్తోంది. లియోను సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ లో ఎస్ఎస్ లలిత్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.రీసెంట్ గా లియో మూవీ నుంచి తెలుగు పోస్టర్ కూడా విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ ను విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. 32 నిమిషాల్లోనే మిలియన్ లైక్స్ రాబట్టి పుష్ప 2 పోస్టర్ రికార్డును కూడా బ్రేక్ చేసింది.గతేడాది లోకేష్ డైరెక్షన్ లో వచ్చిన విక్రమ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ లియోపై అంచనాలు మరింత పెరిగాయి. దళపతి విజయ్ తో లోకేష్ ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తాడో అని ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లియో మూవీ అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఐమ్యాక్స్ ఫార్మాట్ లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: