కన్నడ ఇండస్ట్రీలో హీరోగా మంచి విజయాన్ని అందుకున్న వారిలో నటుడు రక్షిత్ శెట్టి కూడా ఒకరు. కన్నడ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఆయన తెలుగులో కూడా అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ఈయన కన్నడలో నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో ప్రేక్షకుల ముందుకు వస్తాయి. అలా ఇక్కడ కూడా మంచి ఆదరణను పొందుతున్నాడు. అయితే ఈయన నటించిన సప్త స్వరాలు దాటి అనే సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇవాళ విడుదలైనటువంటి ఈ సందర్భంగా

 పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలను చేశారు. నేషనల్ క్రష్ గా ఎంతో మంచిగా గుర్తింపును తెచ్చుకున్న రష్మిక ఈయన ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. అలా ప్రేమించుకున్న వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఘనంగా నిశ్చితార్థ వేడుకలు కూడా జరుపుకున్నారు. అలా నిశ్చితార్థమైన తర్వాత కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకున్నారు. దీంతో ఈయనకు ఇంటర్వ్యూలో భాగంగా రష్మిక గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

రష్మిక తో మీరు ఇప్పటికీ టచ్ లోనే ఉన్నారా మాట్లాడుతున్నారా అనే ప్రశ్న తనకి ఎదురైంది. ఇక ఈ ప్రశ్నకి సమాధానంగా ఆయన.. అవును మేమిద్దరము ఇంకా మాట్లాడుకుంటున్నాము టచ్ లోనే ఉన్నాము అంటూ పేర్కొన్నాడు. దానితోపాటు రష్మిక ఎప్పుడు పెద్ద కళలను కనేది ఇప్పుడు ఆ కలలో నిజం చేసుకునే పనిలో బిజిగా ఉంది. ఈ విషయంలో నిజంగా తనని ప్రశంసించాల్సిందే అంటూ తన గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడాడు. అలా రక్షిత్ రష్మిక మందన పై చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: