కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం లియో .. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రూ.200 కోట్లకు పైగానే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోగా.. డబ్బింగ్ తో సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఈసారి పక్కాగా ఎక్కువ ప్రమోషన్లు చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇలాంటి సమయంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అదేమిటంటే ఈ సినిమాను కేరళలో బాయ్ కాట్ చేయాలంటూ..#KeralaBoycottLEO అంటూ ట్రెండ్ అవుతున్న ఒక హ్యాష్ ట్యాగ్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. హఠాత్తుగా ఉన్నట్టుండి ఇంత క్రేజ్ ఉన్న సినిమాను కేరళలో బ్యాన్ చేయాల్సిన అవసరం ఏముంది అంటూ అభిమానులు సైతం తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.  అయితే ఇందుకు ఒక కారణం ఉంది అని ఒక విషయం బయటకు రావడం జరిగింది. సోషల్ మీడియా డిస్కషన్స్ లో భాగంగా కేరళలోని కొంతమంది మోహన్ లాల్ అభిమానులు.. విజయ్ అభిమానుల మధ్య మాటల యుద్ధం మొదలైంది..

అదేమిటంటే.. వీరిద్దరూ కలిసి నటించిన జిల్లా చిత్రంలో  విజయ్ నటన మోహన్ లాల్ నటన ముందు తేలిపోయిందని మోహన్ లాల్ అన్నారు. అది తమిళ్ విజయ్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. వారు ఎదురుదాడి మొదలుపెట్టారు. ముఖ్యంగా మోహన్ లాల్ నటన చాలా చిత్రాలలో చెత్తగా ఉంది అంటూ అందుకు సంబంధించిన ఫోటోలు,  క్లిప్ లు కూడా షేర్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఇదొక ఉద్యమంగా మారిపోయింది.  ఈ క్రమంలోనే మండిపోయిన మోహన్ లాల్ ఫ్యాన్స్  #KeralaBoycottLEO అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు విజయ్ కి ఉన్న యాంటీ ఫ్యాన్స్ కి షేర్ చేయడం తో పాటూ రీ ట్వీట్ కూడా చేస్తున్నారు.  మరి ఈ మాటల యుద్ధం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: