
అయితే ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో టబూ విషం తాగుతుంది.అయితే ఈ విషయం ముందుగా కృష్ణవంశీ నాగార్జునకి చెప్పకుండా కేవలం హీరోయిన్ వచ్చి కౌగిలించుకుంటుంది అని మాత్రమే చెప్పారట. ఇక కృష్ణవంశీ వేసిన అసలు ప్లాన్ నాగార్జున కి తెలియదు. ఇక అప్పుడే టబు వచ్చి నాగార్జున ని హగ్ చేసుకొని బ్లడ్ రూపంలో వాంథింగ్ చేసుకుంటుంది. ఇక ఆ బ్లడ్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయిన నాగార్జున గట్టిగా అరిచి టబు విషం తాగింది అని భయపడిపోయారట.ఇక నాగార్జున అరిచినా అరుపుకి కృష్ణవంశీ షూటింగ్ ఆపేసి సార్ టబు విషం తాగలేదు. ఇది షూటింగ్లో భాగంగానే.. అయితే ఈ సన్నివేశం మీకు ముందుగా చెప్పలేదు అని అన్నారట. కానీ నాగార్జున మాత్రం నాకెందుకు ఈ సీన్ చెప్పలేదు అంటే నేచులర్ గా సీన్ రావడం కోసం ఇలా చేశాను అని కృష్ణవంశీ చెప్పారట. దాంతో కాస్త కోపంగా వెళ్లి తాను ఎలా చేశాను అని మానిటర్ దగ్గరికి వెళ్లి చూసుకున్నారట నాగార్జున.కానీ అందులో నేచురల్ గా తన యాక్టింగ్ వచ్చేసరికి నాగార్జున కూడా బానే ఉంది అని మెచ్చుకున్నారట.