టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకి బ్రేక్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత నాగచైతన్యని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత నుండి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలపై ఫోకస్ చేసిన సమంత జీవితంలో ఊహించని విధంగా మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. ఇక ఈ వ్యాధి నుండి క్రమ క్రమంగా కోలుకుని మళ్ళీ సినిమాల వైపు వస్తుంది.అలా మయోసైటిస్ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమంత పూర్తిగా నయం కాకుండానే సినిమాల్లోకి వచ్చి

తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసింది. ప్రస్తుతం ఏడాది పాటు సినీ ఇండస్ట్రీకి బై బై చెప్పింది సమంత. ఇండస్ట్రీకి విరామం ఇచ్చిన తర్వాత గత కొంత కాలంగా అమెరికాలో ఉండి తిరిగి ఇండియా చేరుకుంది. ఇక సమంత మయోసైటిస్ కారణంగా సినిమాలకి బ్రేక్ ఇవ్వలేదు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె మయోసైటిస్ నుంచి కోలుకుంది అని కానీ మరొక వ్యాధితో సమంతా బాధపడుతుంది అని అందుకే అమెరికా వెళ్ళింది అని అందుకే గత కొద్ది రోజులపాటు అక్కడే ఉండి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంది అన్న

వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఈ సమస్య భయంకరమైనది కాకపోయినప్పటికీ ఎక్కువగా వర్కౌట్ చేయడం వల్ల ఈ విధమైన వ్యాధికి సమంతా గురైంది అన్న వార్తలు సైతం వినబడుతున్నాయి. మరి సమంత గురించి వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ వార్త విన్న తర్వాత సమంతా త్వరగా ఈ వ్యాధి నుండి కూడా కోలుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా చేసిన సమంత ఈజ్ సినిమాతో భారీ విజయాన్ని తన సొంతం చేసుకుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: