టాలీవుడ్ లో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందిన నిత్యమీనన్ మొదట ఈమె అలా మొదలైంది అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత ఎంతోమంది హీరోలతో పలు సినిమాలలో పలు భాషలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది నిత్యామీనన్.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అలా ఇతర భాషలలో కూడా 50 కి పైగా సినిమాలలో నటించింది నిత్యమీనన్. కెరియర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో కూడా నటించి సత్తా చాటింది.

నిత్యా మీనన్ కోలీవుడ్లో నటించేటప్పుడు ప్రముఖ తమిళ హీరో తనని వేధించారని ప్రచారం జరుగుతోంది అయితే ఈ విషయం పైన నిత్యమీనన్ ని ప్రశ్నించగా.. గాసిప్ ని ప్రముఖ కోలీవుడ్ జర్నలిస్ట్ తన X ట్విట్టర్లో పోస్ట్ చేశారు అతడు నిత్యాతో తన సంభాషణ తాలూకా స్క్రీన్ షాట్లను కూడా ఆమె షేర్ చేయడం జరిగింది.. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని ఆ వార్త తప్పుడు వార్త అంటూ తెలియజేసింది నిత్యమీనన్. తన సోషల్ మీడియాలో ఇలా రాసుకోస్తూ.. ఇది తప్పుడు వార్త పూర్తిగా అవాస్తవం నేను ఎప్పుడు అతడికి ఇంటర్వ్యూ ఇవ్వలేదంటూ తెలియజేసింది.


ఎవరికైనా తెలిస్తే దయచేసి ఈ వార్తలను నమ్మకండి అంటూ చెప్పండి.. కేవలం పాపులర్ అవ్వడానికి ఇలాంటి తప్పుడు వార్తలను క్రియేట్ చేస్తున్నారని తెలియజేసింది నిత్యామీనన్ కోలీవుడ్ తనకు ఎప్పుడూ కూడా ఇలాంటి సమస్య ఎదురు కాలేదని తెలియజేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారమైంది అయితే కోలీవుడ్లో గతంలో ఒక స్టార్ హీరో తనని వేధించారంటూ వచ్చిన వార్తల కూడా అవాస్తవమే అంటూ తెలియజేసింది. అందుకు సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ కూడా వైరల్ గా మారుతోంది .చివరిగా ఈమె కొలంబి అనే మలయాళ చిత్రంలో నటించింది. ఇటీవలే  కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ లో నటించింది అలాగే ధనుష్తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: