టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర కలర్స్ స్వాతి ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా సినిమా మంత్ ఆఫ్ మధు. యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ టీచర్ పాటలు ఆడియోస్ని ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని సుప్రీం హీరో సాయి ధరంతేజ్ తన చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఇందులో భాగంగానే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించగా, ఈ ఈవెంట్ లో సాయి తేజ్ తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు." ముందుగా మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం. మంత్ ఆఫ్ మధు టీం ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ థాంక్స్. 

సినిమా ప్రొడ్యూసర్ యశ్ నా క్లోజ్ ఫ్రెండ్. యశ్ కి ఈ మూవీ ఫస్ట్ థియేటర్ రిలీజ్ అందుకే కొంచెం టెన్షన్ పడుతున్నాడు. ఏం కంగారు పడొద్దు అని చెప్పాను. డైరెక్టర్ శ్రీకాంత్ తీసిన భానుమతి రామకృష్ణ సినిమాలో ఉన్న కాంప్లెక్స్ ఎమోషన్స్ ఈ సినిమాలోనూ ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా కూడా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు కూడా నా స్నేహితుడే. అతనికి కూడా ఆల్ ది బెస్ట్. సినిమాలో హర్ష చాలా బాగా చేశాడని అందరు నాతో చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. యాక్టర్ గా నవీన్ ని చూస్తుంటే నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే డిఫరెంట్, డిఫరెంట్ రోల్స్ లో నటిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఓ సినిమాలో విలన్ గా కనిపిస్తాడు.

 ఇంకో సినిమాలో హీరోగా కనిపిస్తాడు. ఓ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తాడు. ఇక ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు తాగుబోతుగా నవీన్ యాక్టింగ్ చూసి షాక్ అయ్యా. చాలా బాగా చేశాడు. ఇక చివరగా స్వాతి గురించి చెప్పాలంటే, మీ అందరికీ కలర్ స్వాతి స్వాతి అంటే నాకు మాత్రం స్వాతి గాడు. ఎందుకంటే మా కాలేజీ రోజుల నుండే స్వాతి నాకు బెస్ట్ ఫ్రెండ్. కలర్ స్వాతి లాగా స్టార్ట్ అయ్యి స్వాతి అయింది, ఆ తర్వాత స్వాతి గాడు అయ్యింది. ఈ మూవీ స్వాతికి మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ స్వాతి" అని సాయి తేజ్ చెప్పాడు. దాంతో వెంటనే స్వాతి తేజ్ ని హగ్ చేసుకొని ముద్దు పెట్టేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: