అర్జున్ రెడ్డి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంక బాలీవుడ్లో కబీర్ సింగ్ సినిమాని తీసి మంచి పాపులారిటీ అందుకున్నారు. వైలెన్స్ ఏంటనే విషయాన్ని తన నెక్స్ట్ సినిమాలో చూపిస్తానని తెలియజేసిన డైరెక్టర్ సందీప్ వంగ అనుకున్నట్టుగానే యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో ఒక సునామి సృష్టిస్తున్నారు. యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో కంటెంట్ లో భాగంగా ఈ సినిమాకి సంబంధించి వరుస అప్డేట్లను విడుదల చేస్తూనే ఉంది చిత్ర బృందం.


ఇందులో హీరోగా రణబీర్ కపూర్ నటిస్తూ ఉండగా హీరోయిన్గా రష్మిక నటిస్తోంది. ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఊహించని విధంగా ఈరోజు రణబీర్ కపూర్ బర్త్డే కావడంతో అభిమానులకు సదన్ సర్ప్రైజ్ ఇచ్చారు. మొదట రష్మిక, రణబీర్ మధ్య డిస్కర్షన్తో ఈ సినిమా టీజర్ మొదలవుగా సెకండ్ షాట్కే చాలా వైలెంట్గా చూపించడం జరుగుతోంది. అనిల్ కపూర్ రణబీర్ కపూర్ మధ్య ఫాదర్ సెంటిమెంట్ ని చూపించారు. ఇందులో రణబీర్ ను మూడు వేరేషన్లో చూపించడం జరిగింది. ముఖ్యంగా లాంగ్ హెయిర్ చాలా ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నారు.


ఆ తరువాత సూటు బూటు వేసుకొని వెనకాల మనసులతో బ్యాగ్రౌండ్ చాలా స్టైలిష్ గా గ్యాంగ్ స్టార్ గా కనిపించారు.. ఆ తరువాత లుంగీ సల్వార్ లుక్ లో మరింత మాస్ లుక్కు లో కనిపించారు. యాక్షన్ ఎపిసోడ్స్ లో యానిమల్ టీజర్ ఎక్కువగా చూపించలేకపోయారని ఈ ఇంపాక్ట్ కచ్చితంగా టీజర్ మీద చూపిస్తుందని చెప్పవచ్చు. టీజర్లో బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా హైలెట్గా కనిపిస్తోంది. ఎక్స్ప్రెషన్స్ టీజర్ అని మరో నెక్స్ట్ లెవెల్ కి తీసుకువచ్చింది. ఓవరాల్ గా సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాతో రణబీర్ లోని మాస్ యాంగిల్ ని బయటికి తీసుకువచ్చారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ టీజర్ వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: