
ఇక అసలు విషయాని కి వస్తే.. మార్క్ ఆంటోనీ సినిమా హిందీ వర్షన్ సెన్సార్ విషయం లో సభ్యులపై ఆరోపణలు చేశారు విశాల్. ఈసినిమా సెన్సార్ కోసం 6.5 లక్షలు లంచం ఇవ్వవలసి వచ్చిందని విశాల్ గురువారం పోస్ట్ చేశారు. స్క్రీనింగ్ కోసం 3.5 లక్షలు, సర్టిఫికెట్ కోసం 3 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. మరోదారి లేక తాను డబ్బులు ఇవ్వవలసి వచ్చిందని, తాను ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే దృష్టి కి తీసుకు వెళ్తానని చెప్పారు. అయితే విశాల్ చేసిన ఆరోపణలు సంచలనం గా మారాయి. సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఇక విశాల్ ఇంకాస్త ముందడుగు వేసి..ఎవరెవరికి డబ్బులు పంపించారో ఆ వివరాలను కూడా వెల్లడిస్తూ ప్రధాని మోదీ, మహా సీఎం షిండే లను ట్యాగ్ చేశారు. దాంతో ఈ విషయం లో కేంద్ర సమాచార శాఖ సీరియస్ గా తీసుకుని పై విధంగా స్పందించారు.