
థియేటర్లో మంచి రెస్పాన్స్ అందుకున్న ఖుషి సినిమా ఇప్పుడు ఓటీటి లోకి అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ అయినా నెట్ ఫ్లిక్స్ లో నిన్న రాత్రి నుంచి ఈ సినిమా స్ట్రిమింగ్ అవుతున్నట్లు తెలుస్తోంది. అన్ని భాషలలో ఒకేసారి స్ట్రిమ్మింగ్ అవుతోంది . దీంతో ఈ సినిమాని థియేటర్లో మిస్సయిన అభిమానులు సైతం ఓటీటి లో చూడడానికి చాలా మక్కువ చూపుతున్నారు. ఈ చిత్రాన్ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో వెన్నెల కిషోర్ ,జయరాం, రోహిణి తదితరులు సైతం కీలకమైన పాత్రలు నటించారు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే బిఎస్ఎన్ఎల్ లో ఉద్యోగం చేస్తున్న విజయ్ దేవరకొండ కాశ్మీర్లోని సమంతాను చూసి తొలిచూపులోని ప్రేమలో పడతారు ఆ తర్వాత ఈమె కూడా విజయ్ దేవరకొండ అని ప్రేమిస్తుంది అయితే వీరి పెళ్లికి మాత్రం పెద్దలు ఒప్పుకోరు దీంతో వీరిద్దరూ బయటికి వచ్చి వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత కొద్దిరోజులు సంతోషంగా ఉన్న వీరి జీవితం మధ్యలో చిన్న అపార్ధాలు రావడం వల్ల విడిపోయే వరకు వస్తుంది దీంతో మానసిక సంఘర్షణలకు గురైన సమంత, విజయ్ దేవరకొండ ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు అనే విషయంపై ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. మరి ఓటీటి లో ఏవిధంగా ఉంటుందో చూడాలి.