హీరోయిన్ తమన్నా 2005 వ సంవత్సరంలో శ్రీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అంతకుముందు ఇమే హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాలో కూడా నటించింది. తమన్నా మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన సమయంలో కేవలం ఆమె వయసు 13 సంవత్సరాలేనట..అతి చిన్న వయసులోనే తమన్నా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగిందట. తాజాగా తమన్నా తన మొదటి సినిమా గురించి మాట్లాడుతూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తాను ఇంకా స్కూల్లోనే ఉన్నానని త్వరలోనే పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నట్లుగా ఈ వీడియోలో తమన్నా తెలియజేయడం జరిగింది.


ఈ వీడియో చూసిన అభిమానుల సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. ఏంటి తమన్నా 13వ ఏట మొదటి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా.. అయితే ఆ సినిమా కాస్త ఆలస్యం అవ్వడంతో 15వ వేట ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు తెలియజేస్తోంది.. తన వయసు 13 సంవత్సరాలు అంటు తెలియజేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఉత్తరాది ముద్దుగుమ్మ అయినటువంటి తమన్నా అతి చిన్న వయసులోనే ఇంత పెద్దగా కనిపిస్తోంది అంటూ పలువురు అభిమానులు సైతం కామెంట్ చేస్తున్నారు.


ఈ వీడియో చూసిన పలువురు నెటిజెన్స్ సైతం ఈ మాట నిజమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు పైనే అవుతోంది .ఇప్పటికీ స్టార్ హీరోగా పలు సినిమాలలో నటిస్తూ బోల్డ్ వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. ఇటీవల సీనియర్ హీరోల సినిమాలలో కూడా తమన్నా కీలకమైన పాత్రలో నటిస్తోంది. మొత్తానికి తమన్నా బిజీబిజీగా ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు.. చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చిన తమన్నాకు మంచి అవకాశాలు లభిస్తూనే ఉన్నాయి. తన పదేళ్ల సినీ కెరియర్ లో ఎంతోమంది హీరోలతో ఎన్నో భాషలలో నటించింది తమన్నా. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: