ఈ సినిమా విడుదల సమయంలో సల్మాన్ ఖాన్ ఈ షోలో మాట్లాడుతూ ఈ సినిమాలో అమన్ పాత్రలో నటించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కొంతమంది సలహా మేరకు కరణ్ తన వద్దకు వచ్చారు అంటూ సల్మాన్ ఖాన్ మాట్లాడారు. ఈ సినిమాలోని అమన్ పాత్రలో నటించడానికి ముందుగా కరణ్ సైఫ్‌ను చంద్రచూడ్ సింగ్ అడిగాను. కానీ వాళ్ళు నాతో సినిమా చేయనున్నారని చెప్పారని కరణ్ చెప్పాడని సల్మాన్ ఖాన్ వెల్లడించారు అయితే ఈ వ్యాఖ్యలను నటుడు చంద్ర చూడ్ సింగ్ తప్పుపడుతూ సల్మాన్ ఖాన్ పై విమర్శలు చేశారు.
సల్మాన్ ఖాన్ నా పట్ల అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారని ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు సినిమాలే లేవు అంటూ సల్మాన్ ఖాన్ అబద్ధాలు చెబుతున్నారు. ఆ సమయంలో నేను వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నానని చంద్రచూడ్ వెల్లడించారు. ఇక ఈయన కుచ్ కుచ్ హోతా హై సినిమా విడుదల సమయంలో నాలుగు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారని ఆ సమయంలో ఆయన కూడా ఎంతో బిజీగా ఉన్నారని మా విషయంలో సల్మాన్ ఖాన్ అన్ని అబద్ధాలే చెప్పారు అంటూ చంద్రచూడ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి