డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన తాజా చిత్రం యానిమల్. ఇండియా లెవెల్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా రష్మిక నటించిన ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీన విడుదల కాబోతోంది ఇప్పటివరకు ఎవరు చూడని మాస్ అవతారంలో రణబీర్ కనిపించబోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా తండ్రీ కొడుకుల మధ్య సాగేటువంటి ఎమోషనల్ సన్నివేశాలు చాలానే ఆకట్టుకునేలా కనిపిస్తూ ఉన్నాయి. అనిల్ కపూర్ కూడా ఇందులో అద్భుతంగా నటించారని చెప్పవచ్చు.


నిన్నటి రోజున ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని మల్లారెడ్డి యూనివర్సిటీలో చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకకు మహేష్ బాబు రాజమౌళి వంటి వారు ముఖ్యఅతిథిగా రావడం జరిగింది. ఈ వేడుకకు వందలాది సంఖ్యలో విద్యార్థులు కూడా హాజరయ్యారు. ఒక్కసారిగా ఈ జనాన్ని చూసి బాలీవుడ్ స్టార్స్ సైతం ఆశ్చర్యపోయారు.ఈ వేదిక పైన బాబి డియోల్ కపూర్ మాట్లాడుతూ మహేష్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని సైతం తెలియజేశారు.. కొన్నేళ్ల క్రితం పద్మాలయ స్టూడియో సినిమా షూటింగ్లో చేశామని అప్పుడు మహేష్ బాబు సినిమా ప్రారంభోత్సవానికి కృష్ణ తనను ఆహ్వానించారని తెలిపారు.

ఈ విషయం మహేష్ బాబుకు గుర్తుందా అని అడగగా గుర్తుంది అని తెలిపారు. ఆ తర్వాత అనిల్ కపూర్ తో కాసేపు తెలుగులో మాట్లాడేందుకు ట్రై చేశారు. 1980లో వచ్చిన వంశవృక్షం సినిమాతో తన ఫస్ట్ మూవీ అని బాపుగారు తనను ఇండస్ట్రీకి పరిచయం చేశారని తెలిపారు. మళ్లీ 43 ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని తెలిపారు.  మహేష్ బాబుని పొగడ్తలతో ముంచేశారు అనిల్ కపూర్. మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలోని పాటకు అనిల్ కపూర్ డాన్స్ చేస్తూ హైలైట్ గా నిలిచారు ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: