కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోల్లో రజినీకాంత్, కమల్ హాసన్ గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారికున్న క్రేజ్ దేశ వ్యాప్తంగా ఎలాగ ఉందొ మనందరికీ తెలుసు.అయితే ఒకటే జనరేషన్ కి చెందిన ఇద్దరు స్టార్స్ ఇండస్ట్రీ ని షేక్ చేసే రికార్డ్స్ వీరి ఖాతాలో ఉన్నాయి.కమల్‌హాసన్‌, రజనీకాంత్ సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తే అభిమానులకు ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అలాంటి అరుదైన సందర్భంగా డిసెంబర్ 8న రాబోతోంది.చాలా ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నారు. అయితే కొత్త సినిమాలతో కాదు రీ రిలీజ్ మూవీస్‌తో. రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ ముత్తు డిసెంబర్ 8న థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. అదే రోజు కమల్‌హాసన్ సైకో థ్రిల్లర్ మూవీ అభయ్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు సినిమాల స్పెషల్ షోస్ కోసం అభిమానులు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోన్నట్లు తెలిసింది. చివరగా రజనీకాంత్‌, కమల్‌హాసన్ బాక్సాఫీస్ వద్ద 2005లో పోటీపడ్డారు. రజనీకాంత్ చంద్రముఖి, కమల్‌హాసన్ ముంబై ఎక్స్‌ప్రెస్ సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. వీటి లో చంద్రముఖి ఇండస్ట్రీ హిట్‌ గా నిలవగా...ముంబై ఎక్స్‌ప్రెస్ మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. 18 ఏళ్ల తర్వాత మళ్లీ కమల్‌, రజనీ బాక్సాఫీస్ వార్‌కు సిద్ధం కావడం ఆసక్తికరంగా మారింది. ముత్తు సినిమాకు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించాడు. మీనా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ థియేటర్లలో 200 రోజులు ఆడింది. జపాన్‌ లో రిలీజైన ఈ మూవీ అక్కడ కూడా భారీ గా వసూళ్లను రాబట్టింది. కమల్‌హాసన్ అభయ్ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్‌లో కమల్‌హాసన్ నటనకు ప్రశంసలు దక్కాయి. కానీ కమర్షియల్‌గా మాత్రం సినిమా ఆడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: