
నిన్నటి రోజున విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి పైన వైద్యుల సైతం హెల్త్ బుల్ టెన్ విడుదల చేశారు. విజయకాంత్ ఆరోగ్యాన్ని క్రమక్రమంగా మెరుగుపడుతోందని 24 గంటలలో ఆయన పరిస్థితి స్థిరంగా లేదని ప్రస్తుతం పల్సరి చికిత్స అందిస్తున్నామని కెప్టెన్ త్వరగా కోలుకోవాలని మరో 14 రోజులపాటు ఆయన ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుంది అంటూ వైద్యుడు సైతం తెలియజేశారు.. భార్య ప్రేమలత కూడా కెప్టెన్ ఆరోగ్యంగానే ఉన్నారని త్వరలోనే పూర్తిగా కోలుకొని అందరిని కలుస్తారని తెలియజేయడం జరిగింది.
రెండు వారాల క్రితం దగ్గు గొంతు నొప్పితో పాటు అనారోగ్య సమస్యల వల్ల చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరడం జరిగింది విజయ్ కాంత్.. విజయకాంత్ లివర్ లో కూడా సమస్యలు ఎదురవ్వడంతో అందుకు చికిత్సను కూడా వైద్యులు ప్రారంభించారట అప్పటినుంచి ఆయనకు చికిత్స అందిస్తూనే ఉన్నారు ప్రస్తుతం ఈయన వయసు 70 సంవత్సరాలు గత కొన్నిల్లుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.కరోనాకాలంలో ఆయన పరిస్థితి చాలా విషమించింది అంతేకాకుండా డయాబెటిస్ కూడా రావడంతో తన కుడికాలి యొక్క ముడు వెళ్ళను సైతం వైద్యులు తొలగించారు. విదేశాలలో కూడా చికిత్సను అందించడం జరిగింది ఈయన ఎక్కువగా ఆసుపత్రిలో ఉండడంతో పార్టీ బాధ్యతలను ఆయన భార్య ప్రేమలత చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన ఆరోగ్యం కుదుటగానే ఉందంటూ తెలుపుతున్నరు.