డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చిత్రాలలో కాస్త బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయని గతంలో విడుదలైన అర్జున్ రెడ్డి సినిమాతో ఒక క్లారిటీ రావడం జరిగింది. కానీ ఈమధ్య సినిమాలలో బోల్డ్ సన్నివేశాలు చాలా కామన్ గానే మారిపోతున్నాయి.. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమాలో ఇలాంటి సీన్స్ చాలానే చూపించడం జరిగిందట. ముఖ్యంగా రష్మిక ఈ సినిమాలో స్ట్రాంగ్ బోల్డ్ గా నటించిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అందుకు సంబంధించి కొన్ని సన్నివేశాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు నెటిజెన్స్ సైతం చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా రాణిస్తోంది. తెలుగులో వరుసగా సినిమాలతో ఉంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు చేసిన పాత్రలు చాలా సాదాసీదా గానే కనిపించాయి. టాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత ఎక్కువగా హాట్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఈ మధ్యకాలంలో పలు రకాల వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి. చాలా సినిమాలు రిలీజ్ రోజే సోషల్ మీడియాలో లీక్ అవుతూ పలు సన్నివేశాలను హైలైట్ గా చేస్తున్నారు.

దీంతో సినిమాల కలెక్షన్ కు కూడా భారీ దెబ్బ పడేలా కనిపిస్తోంది.యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్ భార్యగా నటించిన రష్మిక చాలా బోల్డ్ గా కనిపించింది. ఇందులో కొన్ని ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలలో రష్మిక రెచ్చిపోయి మరి నటించిందట. ఈ వీడియోలు చూసి చాలామంది ఈమెను ట్రోల్ చేస్తున్నారు.ఈ సినిమా కోసం రష్మిక ఏడు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకోవాలని సమాచారం. అయితే ఇలాంటి వాటిని కూడా రష్మిక ట్విట్టర్ల ఈ వ్యాఖ్యలను సైతం తిప్పి కొట్టినట్లు తెలుస్తున్నది. మరి రాబోయే రోజుల్లో యానిమల్ సినిమా ఎంతటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: