పుష్ప సినిమా తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటులలో జగదీష్ కూడా ఒకరు. ముఖ్యంగా అల్లు అర్జున్ స్నేహితుడిగా కేశవ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు ఈ నటుడు. దీంతో పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకోవడం జరిగింది జగదీష్. జగదీష్ వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఇప్పుడు తాజాగా పంజాగుట్ట పోలీసుల సైతం ఈ నటుడిని అరెస్టు చేశారట.ఒక మహిళ ఆత్మహత్య కేసులో అతనిని అరెస్టు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


పంజాగుట్ట పరిధిలో ఒక మహిళ జూనియర్ ఆర్టిస్టుగా నివాసం ఉంటోందట. గత నెల 29వ తేదీన ఈమె ఆత్మహత్యకు పాల్పడిందని దీనిపైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది.ఈ కేసులో దర్యాప్తు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ దర్యాప్తులో పోలీసులు ఆ మహిళ బలవస్మరణానికి గల కారణాలను సైతం తెలుసుకోవడం జరిగిందట.ఆమె ఒక వ్యక్తితో ఉన్న సమయంలో జగదీష్ ఆమెకు తెలియకుండా కొన్ని ఫోటోలు తీసి పంపించారట. ఈ ఫోటోల సహాయంతో ఆమెను బెదిరిస్తున్నారని దీంతో ఆ మహిళ మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని తెలియజేయడం జరిగింది.


దీంతో నటుడు జగదీష్  ను సైతం నిన్నటి రోజున పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉండేటువంటి కోర్టులో హాజరు పరిచారని కాగా ఆ మహిళకు జగదీష్ కు గతంలో పరిచయం ఉన్నట్లుగా పోలీసులు సైతం తెలియజేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఈ న్యూస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా నటుడు జగదీష్ మరి ఈ కేసులో నిర్దోషిగా తేలుతారా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది. పుష్ప సినిమాలో కేశవ పాత్రలో అద్భుతంగా నటించిన ఈ నటుడు ఓవర్ నైట్ కి మంచి పాపులారిటీ సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: