పాన్ ఇండియా హీరో యష్ అభిమానులు ఎప్పటినుంచో ఆత్రుతగా ఎదురు తన 19వ సినిమాకి సంబంధించి తాజాగా టైటిల్ అనౌన్స్మెంట్ రానే వచ్చేసింది. ఈ మూవీ టైటిల్ను ఈ రోజున మేకర్స్ ప్రకటించారు. దీంతో పాటు టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది.. యష్ నటిస్తున్న 19వ సినిమాకి టైటిల్ టాక్సిస్ అని ఖరారు చేసినట్లు వీడియోలో చూపించారు. అందుకు ట్యాగ్ లైన్ కింద ఏ ఫెయిర్ టెల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే టాగ్ లైన్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ టైటిల్ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి కూడా ఈ వీడియోలో ఎక్కువగా యశ్ లుక్కుని కూడా రివీల్ చేయడం జరిగింది.



ఇందులో యష్ లుక్కు సరిగ్గా క్లారిటీగా కనిపించలేదు.. కానీ టాక్సిక్ పేరు బ్యాగ్రౌండ్ లో తుపాకీతో యష్ కనిపించబోతున్నారు. మరొకవైపు ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ వారు నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో విడుదల కాబోతోంది డైరెక్టర్ గీతు మోహన్ దాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. అయితే ఇందులో హీరోయిన్ తో పాటు ఇతర వివరాలను మాత్రం మేకర్స్ తెలియజేయలేదు. త్వరలోనే ఈ వివరాలను తెలియజేయబోతున్నట్లు సమాచారం.

కే జి ఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా యశ్ అభిమానులను సంపాదించుకున్నారు. రాఖీ బాయ్ గా పేరుపొందిన ఈ నటుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు అయితే కొన్ని నెలలుగా తన తదుపరి చిత్రాన్ని మాత్రం ప్రకటించలేదు. ఇటీవలే టాక్సీక్ అనే చిత్రం టైటిల్ ని రివిల్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ కూడా 2025లో 10వ తేదీ నాలుగో నెలలో ఉన్నట్లుగా తెలియజేశారు. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ గ్లింప్స్ వైరల్ గా మారుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: