కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న  'దేవర' టీజర్ రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 20 లేదా 22 తేదీల్లో దేవర టీజర్ ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూవీ టీం టీజర్ కట్ పనుల్లో నిమగ్నమైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే దేవర టీజర్ రిలీజ్ కాబోతుందనే విషయం తెలిసి అందరి దృష్టి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ పైనే పడింది. టీజర్ కోసం అనిరుద్ ఎలాంటి బీజీయం ఇస్తారో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రస్తుతం దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. మరి కొద్ది రోజుల్లో రాబోయే దేవర టీజర్ కోసం అనిరుద్ ఇచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్ లో 

ఉండబోతుందో అని అందరూ దీని కోసమే ఎదురు చూస్తున్నారు. అసలే టాప్ మ్యూజిక్ డైరెక్టర్. అందులోనూ సౌత్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. నిజానికి దేవరకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారని విషయం బయటికి వచ్చినప్పటి నుంచే సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి చేరుకున్నాయి. ఈ ఏడాది జైలర్, జవాన్, లియో వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు అనిరుద్. ఈ మూడు సినిమాల్లో అనిరుద్ బీజీయం సినిమా సక్సెస్ కి కీలకంగా మారింది. ఈ సినిమాలతో అనిరుద్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. దానికి తోడు చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో అనిరుద్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. 

అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత జెర్సీ సినిమాకి మ్యూజిక్ అందించిన అనిరుద్ మళ్లీ ఇంత గ్యాప్ తర్వాత దేవర మూవీకి స్వరాలు సమకూరుస్తున్నాడు. నిజానికి ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాకే అనిరుద్ మ్యూజిక్ అందించాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల అనిరుద్ ప్లేస్ లో తమన్ ని తీసుకున్నారు. అందుకే ఈసారి ఎన్టీఆర్ దేవర కోసం అనిరుద్ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇవ్వడం ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మరి దేవర మూవీకి అనిరుద్ కంపోజిషన్ ఏ రేంజ్ లో ఉంటుందనేది టీజర్ తోనే తేలిపోనుంది. కాగా సముద్రం బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: