టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అతడు' 'ఖలేజా' లాంటి క్లాసిక్ వండర్స్ తర్వాత రూపొందిన మూవీ 'గుంటూరు కారం'. 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ మూవీని నిర్మించారు.ప్రస్తుతం ట్రెండింగ్ లో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ శ్రీలీల ఈ మూవీలో హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా ఈ మూవీలో స్పెషల్ రోల్ చేసింది. ఈ సినిమాకి ఎస్ ఎస్ తమన్ సంగీత దర్శకుడు. జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి షోతోనే దారుణమైన నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది.అయినప్పటికీ సూపర్ స్టార్ సినిమా కావడం వల్ల కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో వచ్చాయి..కానీ పండుగ సెలవులు ముగిశాక మళ్ళీ కలెక్షన్స్ కొంచెం డ్రాప్ అయ్యాయి.


అయినా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే నమోదు చేసింది ఈ మూవీ. ఒకసారి ఈ మూవీకి వచ్చిన 3 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే  ఈ సినిమాకి 252 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా 130 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫైనల్ గా డిజాస్టర్ టాక్ తో మొదలైన ఈ సినిమా 3 వారాలు కంప్లీట్ అయ్యాక హిట్ స్టేటస్ అందుకుంది. ఈ సినిమాతో మహేష్ తన స్టామినా ఏంటో నిరూపించడమే కాకుండా డైరెక్టర్ త్రివిక్రమ్ కి కూడా ఒక రికార్డ్ ని ఇచ్చాడు. ఈ సినిమా నార్త్ అమెరికాలో నెగటివ్ టాక్ తోనే ఏకంగా 2.63 మిలియన్ డాలర్ల పైగా వసూలు చేసింది.ఈ సినిమాతో త్రివిక్రమ్ ఐదు 2 మిలియన్ డాలర్ల పైగా వసూలు చేసిన సినిమాలు అందుకున్న డైరెక్టర్ గా రికార్డ్ సెట్ చేశాడు. టాలీవుడ్ డైరెక్టర్ లలో టాప్ లో నిలిచాడు. త్రివిక్రమ్ తీసిన సినిమాల్లో అల వైకుంఠపురంలో 3.63 మిలియన్ డాలర్లు రాబట్టగా, గుంటూరు కారం 2.63, అఆ 2.45, అరవింద సమేత వీర రాఘవ 2.18, అజ్ఞాతవాసి 2.06 మిలియన్ డాలర్లు వసూలు చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: