ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2 సినిమాల తర్వాత వరుణ్ తేజ్ కు ఇంతవరకు హిట్ పడలేదు.గని, గాండీవధారి అర్జునుడు సినిమాలతో వరుణ్ కి కోలుకోలేని డిజాస్టర్లు పడ్డాయి.అయినా కూడా తన ప్రయోగాల దారిని మార్చుకోలేదు. ఆపరేషన్ వాలెంటైన్ నేడు అనగా మార్చి 1న విడుదలైంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ సినిమా చాలా సాదాసీదాగా ప్రారంభం అవుతుంది.  ఫస్టాఫ్ అంతగా ఎవరికీ కనెక్ట్ కాదు. ఏదో అలా వెళ్ళిపోతుంది.పుల్వామా దాడి నేపథ్యంలో సినిమా అనేసరికి సినిమాకి వెళ్లిన వాళ్ళు కనెక్ట్ అయ్యే విధంగా ఫస్టాఫ్ లో అంతగా విషయం ఏమీ ఉండదు. కానీ.. ఇంటర్వెల్ ముందు బ్యాంగ్ లో ఒక్కసారిగా తరువాత ఏమవుతుంది? అనే ఉత్కంఠ మాత్రం కచ్చితంగా అందరిలో కలుగుతుంది. ఇక అందుకు తగ్గట్టే సెకండ్ హాఫ్ సినిమా.. పూర్తిస్థాయి ఎమోషన్.. యాక్షన్ తో సాగుతుంది. అందరికీ కూడా పుల్వామా దాడి అంటే తెలుసు. కానీ, ఇది ఎలా జరిగింది? దీనివెనుక ప్రభుత్వం ఏ రకమైన విధానాల్ని ఫాలో అయ్యింది.. ఇలాంటి పాయింట్స్ అన్నిటినీ చూపించే ప్రయత్నం దర్శకుడు చేశాడు.


సినిమా చివరికి వచ్చేసరికి గూస్ బంప్స్ వచ్చేలా క్లైమాక్స్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్.. క్లైమాక్స్ అయితే.. సినిమా చూసే ప్రతి పేక్షకుడికి కూడా దేశభక్తి పొంగిపోయేలా ఉంటాయి. ప్రతి సీన్.. కూడా ప్రేక్షకుడ్ని పుల్వామా సమయంలో దేశంలో పరిస్థితికి కనెక్ట్ చేసేస్తుంది.సినిమాలో అన్ని సీన్స్ చాలా రిచ్‌గా వచ్చాయి. ఇందులో సోనీ పిక్చర్స్ నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌గా ఉన్నాయని చెప్పవచ్చు. దేశభక్తి సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. కొన్ని సీన్స్ అయితే చాలా ఎమోషనల్‌గా ఉంటాయి.ఇది సినిమాకు మంచి హైప్ ఇచ్చింది.ఓవరాల్ గా ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఒకసారి థియేటర్లలో చూడదగ్గ సినిమాగా చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్ కాస్త గందరగోళంగా అనిపించినా.. సెకండ్ హాఫ్ సినిమా మాత్రం నెక్స్ట్ లేవెల్ లో ఉంటుంది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ఈ సినిమా చూడండి. ఖచ్చితంగా నచ్చేస్తుంది.ఫైనల్ గా ఈ సినిమాకి 2.5/5 రేటింగ్ ఇవ్వొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: