ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభం అయ్యి రెండున్నర నెలలు అవుతుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం లో అనేక సినిమాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు థియేటర్ లలో ప్రేక్షకులను ఎంత గానో అలరించాయి. అలాంటి సినిమాలు కొన్ని మంచి విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాయి. ఇకపోతే ఈ సంవత్సరం లో ఇప్పటి వరకు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలుగా నిలిచిన సినిమాలు ఏవి అనేది తెలుసుకుందాం.

ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన హనుమాన్ అనే సినిమా విడుదల అయింది. ఈ సినిమాలో తేజ సజ్జ హీరో గా నటించగా ... ప్రశాంత్ వర్మమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం మొదటి విజయాన్ని అందుకుంది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా ... అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలలో విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన "నా సామి రంగ" సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.


సుహాస్ హీరో గా రూపొందిన అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఈ సంవత్సరం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంది. విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన గామీ సినిమా ఈ సంవత్సరం విడుదల విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ప్రేమలు అనే మలయాళ డబ్బింగ్ సినిమా కొన్ని రోజుల క్రితమే తెలుగులో విడుదల అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: