ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాలో జూనియర్  ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్న వార్ 2 సినిమా కూడా ఒకటి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు  నెలకొన్నాయి. బాలీవుడ్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ సినిమా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెర. కాగా ఎన్టీఆర్ ఈ సినిమాలో రా ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం. కాగా ఈ సినిమాలో రోషన్ కి జోడిగా అందాల భామ కియార అద్వానీ హీరోయిన్గా కనిపించబోతోంది. ఇక ఎన్టీఆర్ సరసన ఎవరు నటించబోతున్నారు

అన్న విషయం మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే ఈ విషయంలోనే బాలీవుడ్ లో ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే మొన్నటి వరకు బాలీవుడ్ భామ షార్వరి జూనియర్ ఎన్టీఆర్కి జోడిగా కనిపించబోతుంది అన్న వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం మరొక పేరు తెరపైకి వచ్చింది. నేషనల్ అవార్డు విన్నర్ ఆలియా భట్ జూనియర్ ఎన్టీఆర్కి జోడిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల హాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ చిత్రంలో అలియా యాక్షన్ సీన్స్ చేసి వావ్ అనిపించారు.

 దీంతో ఈమెను ఇప్పుడు ఈ ఇండియన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ లోకి తీసుకోవాలని మూవీ టీం భావించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్ లో ఈ వార్త వైరల్ గా మారింది. కాగా ఎన్టీఆర్ అండ్ అలియా కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఆల్రెడీ నటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ చిత్రంలో అలియా, ఎన్టీఆర్ కి జోడిగా కనిపించలేదు. కానీ ఆ మూవీ ప్రమోషన్స్ సమయంలో మాత్రం తమ ఫ్రెండ్‌షిప్ తో ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకున్నారు. దీంతో ఈ జోడీని ఒకసారైనా స్క్రీన్ పై హీరోహీరోయిన్స్ గా చూడాలని అభిమానులు ఎప్పటినుంచో ఆశ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: